Home » Covid Vaccine
కొవిడ్-19 మహమ్మారి (Covid-19 Pandemic) సమయంలో వ్యాక్సిన్లు (Vaccines) ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. వైరస్ బారిన పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచి.. ఆ వ్యాక్సిన్లు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. అయితే.. కొందరు అతి జాగ్రత్తకు పోయి రెండు డోస్‌లకు మించి ఎక్కువసార్లు టీకా వేయించుకున్నారు.
కొవిడ్ లాక్‌డౌన్ (Covid Lockdown) తర్వాత గుండెపోటు (Heart Attack) మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న తరుణంలో.. కొవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) వల్లే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (Mansukh Mandavia) తెలిపారు.
దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక సూచన చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్ 19 కారణంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
రూపం మార్చుకుని కొత్త వేరియంట్లతో దాడి చేస్తున్న కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 నూతన కరోనా కేసులు నమోదు కావడంతోపాటు ఐదుగురు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు.
ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.