Share News

Studio Ghibli AI Art: ఘిబ్లి స్టైల్ ఏఐ చిత్రాలు ఇలా క్రియేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్..

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:18 PM

ఎలాన్ మస్క్ గ్రోక్ 3కి పోటీగా ఓపెన్ ఏఐ నుంచి GPT 4o పేరుతో సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ వచ్చేసింది. ఈ టూల్ వినియోగించి అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Studio Ghibli AI Art:  ఘిబ్లి స్టైల్ ఏఐ చిత్రాలు ఇలా క్రియేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్..
Studio Ghibli AI Art

ఇటీవల GPT 4o పేరుతో వెలుగులోకి వచ్చిన కొత్త ఏఐ ఇమేజ్ క్రియేటర్ వెర్షన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ టూల్ ఈజీగా స్టూడియో ఘిబ్లి చిత్రాలను సృష్టిస్తోంది. దీంతో అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాలు మాములు ఫోటోల మాదిరి కాకుండా యానిమేషన్ గేమింగ్ చిత్రాలను పోలి ఉండటం విశేషం. వీటిని జపాన్ వంటి దేశాలతోపాటు అనేక ప్రాంతాల్లో గేమర్లు, డెవలపర్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ఫీచర్ గురించి తెలిసిన క్రియేటర్లు అలాంటి చిత్రాలను క్రియేట్ చేయడం మరింత ఈజీ అయ్యిందని చెబుతున్నారు. అయితే ఈ పిక్స్ ఎలా క్రియేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఉచితంగా క్రియేట్

స్టూడియో ఘిబ్లి చిత్రాలను చాట్ జీపీటీ ద్వారా ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ పరిమితులు ఉంటాయి. జీపీటీ ప్లస్, ప్రో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి పూర్తి స్థాయిలో అందుబాటులో రానుంది. ఓపెన్ఏఐ అధికారికంగా ChatGPT వినియోగదారుల కోసం GPT 4O ఇమేజ్ ఏఐ జనరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ OpenAI వీడియో మోడల్, Soraలో కూడా అందుబాటులో ఉంది.

GPT 4o ద్వారా ChatGPT కొత్త ఇమేజ్ జనరేటర్. ఇది ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఘిబ్లి చిత్రాల్లో ప్రకృతి దృశ్యాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల, మీరు సృష్టించాలనుకునే చిత్రంలో పచ్చటి అడవులు, చెర్రీ బ్లాసమ్ చెట్లు వంటి దూర దృశ్యాలు వంటి ప్రకృతి అంశాలను చేర్చుకోవచ్చు.


ఎలాగంటే..

  • దీనిలో ఇమేజ్ క్రియేషన్ కోసం ముందుగా ప్రాంప్ట్ బార్‌లోని మూడు చుక్కలపై క్లిక్ చేయండి.

  • ఆ క్రమంలో మీకు రెండు ఆప్షన్లు లభిస్తాయి. వాటిలో ఇమేజ్, కాన్వాస్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.

  • చిత్రంపై క్లిక్ చేసి, దానికి మీ ప్రాంప్ట్‌ను ఇవ్వండి. అంటే మీకు ఎలాంటి చిత్రం కావాలనేది తెలపండి.

  • ఆ తర్వాత మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఆధారంగా మీకు ఇమేజ్ రెడీ అవుతుంది

  • ఈ ఫోటోలు సరదాగా ఉండటమే కాకుండా, విభిన్నమైన రంగులను కలిగి ఉంటాయి

  • చిత్రం పూర్తయిన తర్వాత, మీరు దానిపై క్లిక్ చేసి మీ ఫోన్ లేదా సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు


క్రైయాన్

క్రైయాన్, ఒక సాధారణ వెబ్ ఆధారిత AI టూల్, ఇలాంటి ప్రాంప్ట్‌లు ఇచ్చి మీరు ఘిబ్లి వంటి చిత్రాలను సృష్టించుకోవచ్చు. ఈ టూల్ వినియోగదారులకు ప్రాథమిక చిత్రాలు సృష్టించేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది.

ఆర్ట్‌బ్రీడర్

ఆర్ట్‌బ్రీడర్ ద్వారా కూడా మీరు ఇలాంటి చిత్రాలను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే, కొన్ని ఫీచర్ల కోసం చెల్లింపు అప్‌గ్రేడ్ అవసరం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 28 , 2025 | 05:36 PM