RCB vs CSK Playing 11: ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే హిస్టారికల్ క్లాష్.. ప్లేయింగ్ 11 ఇదే..
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:31 PM
Chepauk Clash: చెపాక్ స్టేడియంలో మరికొన్ని సేపట్లో బిగ్ వార్ జరగనుంది. రెండు హాట్ ఫేవరెట్ టీమ్స్ ఆర్సీబీ-సీఎస్‌కే మధ్య టఫ్ ఫైట్‌కు అంతా రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

ఆర్సీబీ- సీఎస్‌కే.. ఐపీఎల్‌లో వీటిని చిరకాల ప్రత్యర్థులుగా చెబుతుంటారు. ఈ రెండు జట్లు బరిలోకి దిగితే కొదమసింహాల్లా కొట్టుకుంటాయి. ట్రోఫీ సంగతి తర్వాత.. ఫస్ట్ ఈ మ్యాచ్‌లో గెలవాలి అని డిసైడ్ అవుతాయి. ఈ రెండు టీమ్స్ మధ్య రైవల్రీ క్యాష్ రిచ్ లీగ్‌కే హైలైట్ అని చెప్పాలి. అలాంటిది మరోమారు బెంగళూరు, చెన్నై తలపడనున్నాయి. శుక్రవారం సాయంత్రం చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి క్లాష్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుంది అనేది ఇప్పుడు చూద్దాం..
చేంజెస్ ఇవే..
విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్న చెన్నై జట్టు.. దాదాపుగా తొలి మ్యాచ్‌లో ఆడించిన జట్టునే రిపీట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర బరిలోకి దిగుతారు. దీపక్ హుడా, రచిన్ రవీంద్ర వరుసగా ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్‌లో ఆడతారు. శివమ్ దూబె, సామ్ కర్రన్, ధోని ఫినిషింగ్ బాధ్యతలు చూసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ దిగుతారు. నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్ పేస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటారు. రాహుల్ త్రిపాఠి, కమ్లేష్ నాగర్‌కోటిలో ఒకరు మ్యాచ్ కండీషన్స్‌ను బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడతారు.
ఒక్క మార్పు ఖాయం
ఆర్సీబీలో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పేసర్ భువనేశ్వర్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఓపెనర్లుగా కోహ్లీ, సాల్ట్ ఆడతారు. కెప్టెన్ పాటిదార్ ఫస్ట్ డౌన్‌లో, లియామ్ లివింగ్‌స్టన్ సెకండ్ డౌన్‌లో దిగడం పక్కా. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఫినిషింగ్ బాధ్యతలు చూసుకుంటారు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ స్పిన్ రెస్పాన్సిలిబిలిటీస్ తీసుకుంటారు. జోష్ హేజల్‌వుడ్, భువనేశ్వర్ పేస్ యూనిట్‌ను నడిపిస్తారు. మ్యాచ్ సిచ్యువేషన్‌ను బట్టి పడిక్కల్, యష్ దయాల్‌లో ఒకరు ఇంపాక్ట్ సబ్‌గా ఆడతారు.
సీఎస్‌కే ప్లేయింగ్ 11 (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ సబ్: రాహుల్ త్రిపాఠి/కమ్లేష్ నాగర్‌కోటి.
ఆర్సీబీ ప్లేయింగ్ 11 (అంచనా):
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, జోష్ హేజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్.
ఇంపాక్ట్ సబ్: దేవ్‌దత్ పడిక్కల్/యష్ దయాల్.