Share News

Bengal Gram: ఏప్రిల్ 1 నుండి శనగ దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:11 PM

దేశంలోని రైతులకు మేలు జరిగేలా ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శనగ దిగుమతులపై 10% దిగుమతి సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Bengal Gram: ఏప్రిల్ 1 నుండి శనగ దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీ
Bengal gram and desi chana

దేశంలో ఈ ఏడాది దేశీ శనగ(Bengal gram) ఉత్పత్తి 11.5 మిలియన్ టన్నులకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. దేశంలోని రైతులకు మేలు జరిగేలా ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి శనగ దిగుమతులపై 10% దిగుమతి సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం పాటించిన సుంకం లేని విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం చర్యలు చేపట్టింది. బదులుగా ఏప్రిల్ 1 నుండి దేశీ శనగపై 10% దిగుమతి సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దేశంలో ఈ ఏడాది చనగ ఉత్పత్తి 11.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నందున ఈ చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని కేంద్రం చెబుతోంది.


ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా దేశీ శనగ (బెంగాల్ శనగ)పై ప్రభుత్వం 10% దిగుమతి సుంకాన్ని విధించింది. గత సంవత్సరం మే నెలలో, దేశీయ లభ్యతను పెంచడానికి, ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం సుంకం లేని శనగ దిగుమతిని అనుమతించింది. దిగుమతి సుంకం మినహాయింపు మార్చి 31, 2025 వరకు వర్తిస్తుంది. ఈ మార్పుకు సంబంధించి ఈ నెల 27న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ డేటా ప్రకారం, చనగ ఉత్పత్తి 2024-25లో 11.5 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. అయితే, ఇది గతేడాది ఇది 11 మిలియన్ టన్నులు.

Avenn Organic Roasted


ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 28 , 2025 | 06:20 PM