Home » Crime News
పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసులో కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, విజయవాడ చేరుకునే ముందే కీసర టోల్‌ప్లాజా సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయినట్లు నిర్ధారణ అయింది
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో సచివాలయ ఉద్యోగి తోట తరుణ్‌కుమార్ రూ.7.50 లక్షల పెన్షన్ సొమ్ముతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా, బాధితులకు ప్రత్యామ్నాయంగా నగదు అందజేశారు
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
పంజాబ్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు బాజిందర్కు సింగ్‌కు అత్యాచారం కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 2018 నాటి కేసులో మోహాలీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, కమలాపురం పట్టణంలో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముగ్గురు యువకులపై సల్మాన్ అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆ అపార్ట్మెంట్ సీపీ కెమెరాలు లేవు. ఘటన సమీపంలో మహిళ వెళుతున్నట్టు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది.
రుయాస్పత్రిలో నెల రోజులుగా సదరం సర్టిఫికెట్ల పరిశీలన జోరుగా సాగుతోంది. ఇప్పటికే 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆస్ట్రేలియాన్ క్రికెటర్ షేన్ వార్న్, 2022 మార్చి 4న థాయిలాండ్‌లో గుండెపోటుతో మరణించారు. కానీ తాజాగా ఆయన మృతి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Bengaluru: ఈ బస్టాండ్ మీదుగా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతూ ఉంటుంది. నిత్యం ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండ, వర్షం వచ్చినపుడు ఇక్కడే గుమిగూడతారు. ఎప్పుడూ రద్దీ ఉండే ఈ బస్టాప్ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.