Bengaluru: షాకింగ్ న్యూస్.. అదృశ్యమవుతున్న బస్టాప్‌లు..
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:54 PM
Bengaluru: ఈ బస్టాండ్ మీదుగా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతూ ఉంటుంది. నిత్యం ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండ, వర్షం వచ్చినపుడు ఇక్కడే గుమిగూడతారు. ఎప్పుడూ రద్దీ ఉండే ఈ బస్టాప్ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

Bengaluru Bus stand: సిలికాన్ సిటీ బెంగళూరులో వింత ఘటన జరిగింది. ఎప్పుడూ జనాలతో రద్దీ ఉండే ఓ బస్టాప్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. హఠాత్తుగా ఇలాంటి విచిత్రమైన ఘటన జరగడంతో రోజూ అక్కడొచ్చి బస్సెక్కే ప్రయాణీకులు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డుపై బస్టాండ్ కనిపించకుండా పోయిందని తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు కారణమేంటో తెలియక భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక్క బస్టాప్ మాత్రమే కాదు. సిటీలో చాలాచోట్ల బస్టాండ్లు ఒకదాని తర్వాత మరొకటి మాయమైపోతున్నాయి మరి.
బస్టాండ్లనే ఎత్తుకెళ్తున్నారు..
చాలా ప్రాంతాల్లోలాగే బెంగళూరు కూడా బైక్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్, ఇళ్లలో దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతుంటారు. కానీ, ఇప్పుడా జాబితాలోకి బెంగళూరులోని BMTC బస్ స్టాప్ కూడా చేరింది. విచిత్రంగా బస్టాండ్లపై కన్నేసారు బెంగళూరు దొంగలు. కార్పొరేషన్ (BBMP) నిర్మించిన అనేక బస్ షెల్టర్లను ఒకటొకటిగా లేపేస్తున్నారు. నిత్యం జనాలతో నిండి ఉండే ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చోటు చేసుకోవడమే అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వరస బస్టాప్ దొంగతనాలపై కార్పొరేషన్ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్‌కు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన బస్ షెల్టర్ల విషయమై త్వరగా దర్యాప్తు చేయాలని కోరారు.
తొలి హైటెక్ బస్ స్టాప్ మాయం..
విజయనగరంలోని గోవిందరాజనగర్ వార్డులో అనేక బస్ స్టాప్‌లు అదృశ్యమయ్యాయి. లేఅవుట్ లోని 14వ కూడలిలో సర్వజ్ఞ స్కూల్ ముందు ఉండే బస్ షెల్టర్ కూడా మాయమైంది. ఈ బస్ షెల్టర్‌ను ఐదు సంవత్సరాల క్రితం రూ.16 లక్షల రూపాయల ఖర్చు చేసి నిర్మించారు. నగరంలో నిర్మించిన మొట్టమొదటి హైటెక్ బస్ షెల్టర్‌గా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతాయి. ఎప్పుడు ప్రయాణీకులతో రద్దీగా ఈ బస్టాప్ దాదాపు నెల రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. విలువైన కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, ఇనుప వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అదేవిధంగా, ఆదిచుంచనగిరి ఆట స్థలం సమీపంలోని మరో రెండు బస్ షెల్టర్లు కూడా కనిపించకుండా పోయాయి. బస్టాండ్లు లేకపోవడంతో ప్రయాణీకులు ఎండకు, వానకు నిలబడుతూ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Read Also: Prashant Kishore: వక్ఫ్ సవరణ బిల్లుతో విభేదించిన పీకే... ఆ పార్టీకే నష్టమని జోస్యం
Myanmar Earthquake: నైఫిడోలో తాజా ప్రకంపనలు..గోరుచుట్టుపై రోకటిపోటు
Income Tax: సామాన్యులకు ఐటీ డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాకులు