Share News

Hyderabad: రూ. 5 వేల కోసం ఆశపడితే రూ. లక్ష గాయబ్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:08 AM

నగరంలో కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు క్రెడిట్‌ కార్డుల నుంచి డబ్బు కొల్లగొడుతున్నారు. వేర్వేరు సంఘటనలో ఇద్దరు రూ.లక్ష చొప్పన కోల్పోయి సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad: రూ. 5 వేల కోసం ఆశపడితే రూ. లక్ష గాయబ్‌

- క్రెడిట్‌ కార్డు రివార్డ్‌ పాయింట్ల పేరుతో సైబర్‌ మోసం

- మరో ఘటనలో టెక్నీషియన్‌ చేతివాటం

హైదరాబాద్‌ సిటీ: మీ క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లను నగదు రూపంలోకి మార్చుకోవాలనుందా.. అయితే ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి అంటూ ఆశపెట్టిన ఓ సైబర్‌ మోసగాడు నగరవాసి నుంచి రూ.లక్ష కాజేశాడు. నగరానికి చెందిన వ్యాపారి (41)కి 8415984558 నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మేం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు విభాగం నుంచి ఫోన్‌ చేస్తున్నాం.. మీ క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు గాను రూ.5 వేల విలువైన రివార్డు పాయింట్లు వచ్చాయి.

ఈ వార్తను కూడా చదవండి: Metro train: ఏప్రిల్‌ 1 నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో రైళ్లు..


వాటిని నగదులోకి మార్చుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి..’ అంటూ సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) వ్యాపారి వాట్సా్ప్‏(WhatsApp)కు లింక్‌ పంపాడు. ఈ లింక్‌ ఓపెన్‌ కాలేదన్న బాధితుడు సమాచారంతో మరో ఏపీకే ఫైల్‌ లింక్‌ను పంపాడు. అందులో వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు వివరాలు నమోదు చేసిన కొద్దిసేపటికే క్రెడిట్‌కార్డు నుంచి రూ.లక్ష బదిలీ అయినట్లు తెలుసుకున్నాడు. మోసపోయినట్లు గుర్తించి బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

city5.2.jpg


మరో ఘటనలో ఫైబర్‌ టెక్నీషియన్‌ చేతివాటం..

వరంగల్‌ ప్రాంతానికి చెందిన ముడికె బాల్‌రాజ్‌ నగరంలో జియో ఫైబర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ సేవలు వినియోగిస్తున్న ఓ రిటైర్డు ఉద్యోగి (74)కి సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు సర్వీస్‌ కోసం వెళ్లి దానిని అప్‌గ్రేడ్‌ చేయాలని చెప్పి అతడి క్రెడిట్‌ కార్డు వివరాలు సేకరించాడు. తర్వాత కార్డు వివరాలతో ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులు చేశాడు. అయితే, క్రెడిట్‌కార్డు నుంచి రూ.1.11 లక్షలు చెల్లింపులు జరిగాయని గుర్తించిన బాధితుడు బ్యాంకు అధికారులను ఆ తర్వాత సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాల్‌రాజ్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

40 ఏళ్లుగా మసిలే జలధారలు!

టెన్త్‌ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం

జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 30 , 2025 | 11:08 AM