Share News

Cyber Criminals: మీ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు వస్తున్నాయంటూ..

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:40 AM

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. మీ పేరున ఉన్న మొబైల్‌ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు, బూతు సందేశాలు వస్తున్నాయి.. దీనికి సంబంధించి బెంగళూరు పోలీస్‏స్టేషన్‌లో కేసు నమోదైంది’ అంటూ ఏకంగా రూ.8.50 లక్షలు కొల్లగొట్టారు. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన విషయం మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Cyber Criminals: మీ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు వస్తున్నాయంటూ..

- డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి రూ.8.50 లక్షలు కొల్లగొట్టారు..

హైదరాబాద్‌ సిటీ: డిజిటల్‌ అరెస్ట్‌ చేశామంటూ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ. 8.50 లక్షలు కాజేశారు. నగరంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి ఫోన్‌ చేసిన వ్యక్తి తాను ట్రాయ్‌ అధికారిగా చెప్పుకున్నాడు. ‘మీ పేరున ఉన్న మొబైల్‌ నంబర్‌ నుంచి ఓ మహిళకు నగ్న చిత్రాలు, బూతు సందేశాలు వస్తున్నాయి.. దీనికి సంబంధించి బెంగళూరు పోలీస్‏స్టేషన్‌లో కేసు నమోదైంది’ అని చెప్పాడు. తర్వాత 73679 36032 నంబర్‌ నుంచి పోలీసు దుస్తులు ధరించిన వ్యక్తి వాట్సాప్‌ వీడియో కాల్‌(WhatsApp video call) చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్‏పై విరుచుకుపడ్డ ఎంపీ అసదుద్దీన్‌.. ఆయన ఏమన్నారంటే..


city3.2.jpg

మీ బ్యాంకు ఖాతాను ఘరానా నేరగాడు సదాకత్‌ఖాన్‌ అక్రమ లావాదేవీలకు వినియోగిస్తున్నాడని చెప్పాడు. డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ గదిలోనే ఉండాలని బెదిరించాడు. తనకు ఏమీ తెలియదని బాధితుడు చెప్పడంతో ‘మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఆర్‌బీఐ ఖాతాలకు పంపండి. వారు వెరిఫై చేసి తిరిగి మీ ఖాతాలో వేస్తారు’ అని చెప్పాడు. బాధితుడు రూ.8.50 లక్షలు సైబర్‌ నేరగాడు సూచించిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేశాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 10:02 AM