Home » Dola Sree Bala Veeranjaneya Swamy
అమరావతి: టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.
విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి (Minister Dola Veeranjaneya swamy) స్పష్టం చేశారు. భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) తెలిపారు.వారి నుంచి పెద్దఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సప్ మెసేజ్లతో తన ఫోన్ నిండి పోయిందని చెప్పారు.