Home » Duvvada Srinivas
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంటి గొడవ రచ్చ కావడంతో దువ్వాడ శ్రీను సోదరుడు రంగంలోకి దిగి వాణితో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిపిన చర్చలు ఒకే ఒక్క డిమాండ్‌తో ఆగిపోయాయి. ఆ డిమాండ్ ఏంటంటే.. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు గురించి చర్చ.. ఆ విషయంపై దువ్వాడ శ్రీను- దువ్వాడ వాణి గొడవ పడుతుంటే మధ్యలోకి రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వచ్చారు.
ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్‌లో గంటకో ట్విస్ట్.. ట్విస్ట్‌లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజా అప్‌డేట్ ఏంటంటే.. దువ్వాడతో సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) కుటుంబ వ్యవహారం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో మరింత దుమారం రేపుతోంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా కొనసాగుతోంది. నాలుగవ రోజుకు చేరిన దువ్వాడ సతీమణి వాణి, కుమార్తెలు నిరసనకు దిగారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చెలరేగిన వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి ఆది నుంచీ వివాదస్పదమే. దూకుడు స్వభావం, నోటిదురుసు, వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. దీని మూలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల ద్వారా టెక్కలి జడ్పీటీసీ మినహా మరే ఇతర పదవులను అందుకోలేకపోయారు. రాజకీయంగా తొలుత..
Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ వివాదం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బిగ్ డిస్కషన్‌గా నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్‌పై ఆయన భార్య, పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే..
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తోంది. పర్సనల్ వివాదాలు కాస్తా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్షిప్. ఇంట్లో ప్రియురాలు.. ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ యవ్వారం.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మాంచి రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజులుగా ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడ తమను వదిలేసి వేరొక మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కూతుళ్లిద్దరూ మొన్న రాత్రంతా ఆయన నివాసం ముందు ఆందోళన చేశారు.