Share News

Duvvada Srinivas: రంగంలోకి ఇంటి ఓనర్.. ఏమన్నారంటే..?

ABN , Publish Date - Aug 14 , 2024 | 08:11 PM

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంటి గొడవ రచ్చ కావడంతో దువ్వాడ శ్రీను సోదరుడు రంగంలోకి దిగి వాణితో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిపిన చర్చలు ఒకే ఒక్క డిమాండ్‌తో ఆగిపోయాయి. ఆ డిమాండ్ ఏంటంటే.. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు గురించి చర్చ.. ఆ విషయంపై దువ్వాడ శ్రీను- దువ్వాడ వాణి గొడవ పడుతుంటే మధ్యలోకి రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వచ్చారు.

Duvvada Srinivas: రంగంలోకి ఇంటి ఓనర్.. ఏమన్నారంటే..?
Duvvada Srinivas

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ డ్రామాలో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంటి గొడవ రచ్చ కావడంతో దువ్వాడ శ్రీను సోదరుడు రంగంలోకి దిగి వాణితో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిపిన చర్చలు ఒకే ఒక్క డిమాండ్‌తో ఆగిపోయాయి. ఆ డిమాండ్ ఏంటంటే.. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు గురించి చర్చ.. ఆ విషయంపై దువ్వాడ శ్రీను- దువ్వాడ వాణి గొడవ పడుతుంటే మధ్యలోకి రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వచ్చారు.


duvvada.jpg


ఎవరీ పార్వతీశం..

దువ్వాడ శ్రీనివాస్ భార్యతో కాకుండా వేరుగా ఉంటున్నారు. రిటైర్డ్ టీచర్ పార్వతీశం వద్ద భూమి కొనుగోలు చేశారు. అక్కడే ఇల్లును నిర్మించుకున్నారు. ఆ ఇంటి భూమికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ మొత్తం నగదు అందజేయలేదట. ఇదే విషయాన్ని పార్వతీశం చెబుతున్నారు. ఇంటికి సంబంధించి రూ.60 లక్షలు ఇవ్వాలని వివరించారు. ఆ నగదు రాకుండా ఇంటిని ఎలా బదిలీ చేస్తారని పార్వతీశం నిలదీస్తున్నారు. తన డబ్బులు ఇచ్చేవరకు ఇంటిని పంచుకునేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. ఆ రూ.60 లక్షలకు సంబంధించి శ్రీనివాస్ బ్లాంక్ చెక్కు ఇచ్చాడు.. ఆ చెక్కు చెల్లుబాటు కాలేదని వివరించారు.


Duvvada-Final.jpg


కొత్త బాధ..

దువ్వాడ వాణి డిమాండ్లతో శ్రీనివాస్ సతమతం అవుతున్నారు. దువ్వాడ ఉంటోన్న ఇంటిని తదనంతరం కూతురు పేరు మీద రాయాలని దువ్వాడ వాణి కోరుతుంది. అందుకు శ్రీనివాస్ ససేమిరా అనడంతో చర్చలకు బ్రేక్ పడింది. కాదు.. కూతుళ్ల పేరుతో వీలునామా రాయాల్సిందేనని వాణి భీష్మించుకొని కూర్చొంది. ఇంతలో చింతాడ పార్వతీశం ఎంట్రీ ఇచ్చారు. నా డబ్బులు నాకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో దువ్వాడ ఫ్యామిలీ గొడవ కొత్త టర్న్ తీసుకుంది.

Updated Date - Aug 14 , 2024 | 08:49 PM