Home » Election Commission
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు నేతలు. నగదు, మద్యం, చీరలు, రకరకాల వస్తువులను ఇచ్చి ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికి చెక్‌పెట్టేందుకు ఈసీ, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకునేందుకు ఈసీ, పోలీసులతో కలిసి అన్ని రకాల చర్యలు చేపట్టింది.
నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాల ఎస్పీ లకు ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా, పక్షపాతంగా ఉంటున్నారని సీరియస్ అయ్యింది. నిష్పక్షపాతంగా ఉండకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సంఘటన జరిగిన తరువాత కూడా సరిగా స్పందించడం లేదని ఈసీ పేర్కొంది. రాయలసీమలోని రెండు జిల్లాలు, ఉత్తరాంధ్ర , కోస్తా, గోదావరి జిల్లాలోని ఒక్కో ఎస్పీకి ఈసీ వార్నింగ్ ఇచ్చింది.
ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.
ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్‌పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
Telangana: తెలంగాణలో రైతు భరోసా పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధు పంపిణీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రైతు భరోసా పథకంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
Andhrapradesh: ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదని.. కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొత్తంగా3 లక్షల 3 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు ప్రకటించారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు.
మూడో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 3 వ ఫేజ్‌లో 12 రాష్ట్రాలు, యూటీలలోని 93 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అస్సాం (4), బీహార్ (5),ఛత్తీస్ ఘడ్(7),దాద్రా నగర్ హవేలీ ,డామన్ & డయ్యు,(2) గోవా (2) గుజరాత్(26), కర్ణాటక(14) మహారాష్ట్ర(11),ఉత్తరప్రదేశ్ (10),వెస్ట్ బెంగాల్ (4),మధ్యప్రదేశ్ (8) రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.
ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది.