Share News

Loksabha Polls: పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఆంక్షలు.. ఎందుకంటే ..?

ABN , Publish Date - May 11 , 2024 | 05:21 PM

పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఒక రోజు ముందు నుంచే పోలీసు బలగాలు పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎం తరలించినప్పటి నుంచి ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ముగ్గుతో గీస్తారు.

Loksabha Polls: పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఆంక్షలు.. ఎందుకంటే ..?
polling center

హైదరాబాద్: పోలింగ్ కేంద్రం (polling center) వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఒక రోజు ముందు నుంచే పోలీసు బలగాలు పోలింగ్ స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. ఈవీఎం తరలించినప్పటి నుంచి ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు ముగ్గుతో గీస్తారు. ఆ పరిసరాల్లోకి ఎవరిని రానీయరు. ఓటు వేసే వారు, గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తారు. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఏ బూత్ వారు ఆ బూత్ లోనికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.


ఆంక్షలు ఎందుకంటే..?

పోలింగ్ కేంద్రం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆంక్షలు విధిస్తారు. ఓటు లేని వారిని, సామాన్య జనాలను అనుమతించరు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తతతో ఉంటారు. పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. గీసిన ముగ్గు దాటి లోపలికి వచ్చేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. బీహార్‌లో ముఠాలు, గ్రూపుల ఉంటాయి. ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఉండటంతో కేంద్ర బలగాలు రంగంలోకి దింపుతారు.


ముగ్గుతో గీత ఎందుకు గీస్తారంటే..?

పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు ఉంటాయి. అది తెలిపేందుకు ముగ్గుతో గీస్తారు. లైన్ చివర పోలీసులు ఉంటారు. ముగ్గు గీసిన లైన్ దాటి రావొద్దని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతుంటారు. ముఖ్యంగా ఓటు రాని పిల్లలు, ఓటు వేసి వచ్చిన వారు పోలింగ్ సెంటర్ దరిదాపుల్లోకి రానీయరు.



Read Latest
AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 06:20 PM