Home » Election Commission
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారిగా వెబ్సైట్లో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్పష్టం చేసింది. ఇందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షకు మందికి పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తర భారతదేశంలో వడగాలులు వీస్తుండటంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
పోలింగ్ కేంద్రాల వారీగా పోలింగ్ శాతం తెలపడం, దాన్ని వెబ్సైట్లో పెట్టడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందువల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పింది. ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలియజేసే ఫామ్ 17(సి)ని బయటపెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని గుర్తు చేసింది. వాటిని బయట పెడితే
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ మరుసటి రోజు నుంచి ఏపీలో జరిగిన అల్లర్లు, అరాచకాలపై మరోసారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఫిర్యాదు చేశారు.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్ బుత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో.. ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇప్పటికే సీఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.