Share News

Rain Alert: తెలంగాణలో భారీ వర్షం.. వడగళ్ల వాన

ABN , Publish Date - Mar 21 , 2025 | 07:30 PM

Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rain Alert:  తెలంగాణలో భారీ వర్షం.. వడగళ్ల వాన
Heavy Rains

కరీంనగర్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ (శుక్రవారం) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా.. సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.


తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా.. వేడి తీవ్రతతో పాటు వడగాలులు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు


ఈ వార్తలు కూడా చదవండి

Betting App: ఆ హీరోల వల్లే 80 లక్షలు పోగొట్టుకున్నా.. వారిని శిక్షించాల్సిందే..

Good News: రేషన్ కార్డు దారులకు శుభవార్త..

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 08:13 PM