Share News

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:53 AM

సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్‌లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీమంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) విమర్శించారు,

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

- మాజీమంత్రి జయకుమార్‌

చెన్నై: సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్‌లా ఎదిగి, వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పగటికలలు కంటున్నాడని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీమంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) విమర్శించారు, ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, అధికారంలో లేనప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండేది అన్నాడీఎంకే మాత్రమేనన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: కేంద్రంపై సీఎం స్టాలిన్‌ ధ్వజం.. రాష్ట్రంలో తిరిగే రైళ్లకు హిందీలో పేర్లు


nani2.2.jpg

విజయ్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ అసెంబ్లీ ఎన్నికలపై సలహాలిస్తున్నారని, అయితే అన్నాడీఎంకేను ముందుకు నడిపించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత(MGR, Jayalalithaa) ఎవరి సలహాలు లేకుండానే ప్రజల మెప్పుపొందేలా ఎదిగారన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 3శాతం ఎక్కువ ఓట్లు మాత్రమే పొంది డీఎంకే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. డీఎంకే కూటమిలోవున్న డీపీఐ, సీపీఎం(DPI, CPM) తదితర పార్టీలు అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాయని, ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఆ కూటమిలో మిగతా పార్టీలు కూడా ఇలాగే వ్యవహరించే అవకాశముందన్నారు.


ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు

ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్‌ పార్కులు

ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!

ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2025 | 11:53 AM