Share News

Vijay: అధికారపార్టీతోనే మాకు ప్రధాన పోటీ..

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:02 PM

ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పోటీ లేదని, అధికార డీఎంకే పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆయన పేర్కొనడం రాష్ర్ట వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

Vijay: అధికారపార్టీతోనే మాకు ప్రధాన పోటీ..

- టీవీకే నేత విజయ్‌

- పేరులో వీరత్వం ఉంటే చాలా?.. స్టాలిన్‌పై విసుర్లు

- అట్టహాసంగా సర్వసభ్యమండలి

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే(DMK, TVK) పార్టీల మధ్య ప్రధాన పోటీ వుంటుందని, రాజకీయపరంగా డీఎంకే మాత్రమే తమకు బద్ధశత్రువు అని టీవీకే అధినేత విజయ్‌(Vijay) మరోమారు పునరుద్ఘాటించారు. తిరువాన్మియూరులోని రామచంద్రా కన్వెన్షన్‌హాలులో జరిగిన టీవీకే సర్వసభ్యమండలి సమావేశంలో విజయ్‌ మాట్లాడుతూ.. పార్టీలో ద్రావిడం, పాలనలో ద్రావిడ తరహా అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ రోజూ జనాన్ని మోసుపుచ్చటమే డీఎంకే పాలకులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పార్టీని ప్రారంభించినప్పుటి నుండి సర్వసభ్యమండలి సమావేశం వరకు పాలకులు ఎన్నో అడ్డంకులు కలిగించారని ధ్వజమెత్తారు. పార్టీ ప్రముఖులు ఆదవ్‌అర్జునా, నిర్మల్‌కుమార్‌, రమేష్‌ వీరంతా డీఎంకే పాలనను విమర్శిస్తున్నారని, వారిలాగే తాను కూడా విమర్శలు చేయాలా అని కాస్త తటపటాయించానని, ప్రస్తుతం డీఎంకే పాలకులు అదే పనిగా అడ్డంకులు సృష్టిస్తుంటే ఇక ఊరుకోలేనన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..


ఫాసిస్టు పాలన...

‘ముత్తువేల్‌ కరుణానిధి స్టాలిన్‌ గారూ పేరులో వీరత్వం ఉంటే చాలదు, కార్యాచరణలో, పరిపాలనలో మీ సత్తా ఏమిటో చూపాలి. కేంద్రంలోని బీజేపీది ఫాసిస్టు పాలన అంటూ పదేపదే చెబుతున్న మీరు చేస్తున్నదేమిటో ఒకసారి ప్రశ్నించుకోండి. టీవీకే పార్టీ శ్రేణులు ప్రజలను కలుసుకోనివ్వకుండా అడ్డంకులు కలిగించే అధికారం మీకెవరిచ్చారు? మీ ఆంక్షలను ఉల్లఘించి ప్రజలను కలుసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే చట్టాన్ని గౌరవించాలన్న భావంతోనే సహనం పాటిస్తున్నాను అంటూ విజయ్‌ ధ్వజమెత్తారు. ఆనకట్టలతో వాగును అడ్డుకోగలరు, అదే పెనుగాలిని అడ్డుకోలేరు. అడ్డుకుంటే గాలిలో కొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మచ్చుకైనా లేవు, అంతా కరెప్షన్‌, కపటదారుల ప్రభుత్వమే కారణంగా, ఈ దుస్థితి మారాలని అన్నారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ ఇంటిలోని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు పాటుపడండి అంటూ పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా కష్టాలను అనుభవిస్తున్న మహిళలే వచ్చే యేడాదిజరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని చిత్తుగా ఓడించనున్నారని విజయ్‌ అన్నారు.


ఎన్నికల పొత్తులపై విజయ్‌కే నిర్ణయాధికారం!

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవాలనే విషయాలపై నిర్ణయాధికారాన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్‌కి అప్పగిస్తూ శుక్రవారం జరిగిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) సర్వసభ్య మండలి సమావేశం ఓ తీర్మానం చేసింది. పరందూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసుకుని మరోచోట ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్రంలో ద్విభాషా విద్యావిధానాన్ని కొనసాగించాలని, తమిళ జాలర్ల సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, వక్ఫ్‌బోర్డు ముసాయిదా సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని,


nani1.2.jpg

లైంగిక వేధింపులను విచారణ జరిపేందుకు స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి 90 రోజుల్లో తీర్పులు వెలువరించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సర్వసభ్యమండలి మొత్తం 17 తీర్మానాలను ప్రవేశపెట్టింది. సర్వసభ్యమండలి సమావేశానికి రాష్ట్రం నలమూలుల నుండి జిల్లా కార్యదర్శులు, సర్వసభ్యమండలి సభ్యులు ఉదయం ఏడుగంటలకే హాజరయ్యారు. సభ్యులను గుర్తింపు కార్డులో క్యూఆర్‌కోడ్‌ పరిశీలించిన మీదటే లోపలకు అనుమతించారు. ఉదయం 7.30 గంటలకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ పనయూరులోని తన నివాసం నుండి బయలుదేరి వేదికకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు విజయ్‌ అధ్యక్షత సమావేశం ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌, ఎన్నికల విభాగం నాయకుడు ఆదవ్‌ అర్జునా, కోశాధికారి వెంకట్రామన్‌ డిప్యూటీ కార్యదర్శి సీటీ నిర్మల్‌కుమార్‌ తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.


సర్వసభ్యమండలి విశేషాలు..

- విజయ్‌ తల్లిదండ్రులు ఏస్‌ఏ చంద్రశేఖర్‌, శోభ వేదిక ముందు వరుసలో ఆశీనులయ్యారు.

- సర్వసభ్యమండలి సమావేశానికి ఉదయం ఏడు గంటలకే పార్టీ శ్రేణులు తరలిరావటంతో ట్రాఫిక్‌ సమస్యను పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీఆనంద్‌ దగ్గరుండి క్రమబద్ధీకరించారు.

- సమావేశానికి వచ్చినవారికి ఉదయం పొంగల్‌, వడ, టీ పంపిణీ చేశారు. మధ్యాహ్నం 22 రకాల పదార్థాలతో శాఖాహార భోజనాన్ని వడ్డించారు.

- సర్వసభ్యమండలి సమావేశంలోనికి సెల్‌ఫోన్లను అనుమతించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్‌ గద్దలు

కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..

ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2025 | 12:02 PM