Home » Hyderabad News
దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య.. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా? కాషాయపార్టీ వర్గాలు ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి! ‘బీసీ సీఎం’ నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ..
రాష్ట్రంలో సర్కారీ దవాఖానాలపై రాజకీయాలు చేస్తున్నారు. పెద్దాస్పత్రులపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే ప్రాణాలు పోతాయన్న భయాన్ని పేదల్లో కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దామగుండంలో 48 శాతం విస్తీర్ణాన్ని తూర్పు నౌకా దళ రాడార్ స్టేషన్ నిర్మాణానికి వినియోగిస్తుండగా మిగిలిన భూమిలో అటవీ సంపదకు ఎలాంటి హానీ కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ తెలిపారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
రీజినల్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పుపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లడం కష్టమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
నేత్ర వైద్య రంగానికి అత్యుత్తమ సేవలందించిన పరిశోధకులతో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన జాబితాలో హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సంతోష్ జీ హొనావర్ భారతదేశంలో అగ్రగాములుగా నిలిచారు.
రాజధానికి అతి దగ్గరలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో 3 వేల ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
సైదాబాద్‌లో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దేశం లో ఎక్కడ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా.. సైదాబాద్‌తో లింకులు ఉంటాయనే అపవాదు ఉండేది. అప్పట్లో గుజరాత్ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు కూడా ఇక్కడి ఓ హోటల్లో కుట్ర జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.