Home » India vs England Test Series
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బంతితో మాయాజాలం చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. విజృంభించి బంతులు సంధించే సమయంలో ఈ స్పిన్-మాంత్రికుడిని ఆడడం బ్యాట్స్మెన్లకు అంత సులభం కాదు. హైదరాబాద్‌లో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ శతక్కొట్టడంతో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేయగలిగింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు ఆట ముగిసింది. ఈ మొదటి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తడాఖా చూపిస్తోంది. బజ్‌బాల్ అంటూ బిల్డప్పులు ఇచ్చుకుంటూ వచ్చిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు మనోళ్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
భాగ్యనగరం హైదరాబాద్ వేదికగా గురువారం మొదలు కానున్న తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ టీమ్ తుది జట్టుని ప్రకటించింది. మొత్తం నలుగురు స్పిన్నర్లకు ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ అవకాశమిచ్చింది. 24 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీకి అరంగేట్రం చేయబోతున్నాని ప్రకటించింది.