National Archery Championship: వీవీఐటీలో ముగిసిన నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:34 AM
వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (VVIT) లో నిర్వహించిన చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 900 మంది క్రీడాకారులు పాల్గొని జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్చర్లు మెడల్స్ సాధించారు.

పెదకాకాని, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ నాలుగు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-13, అండర్-15 విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలలో జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులు అత్యధికంగా మెడల్స్ సాధించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన ఆర్చర్లు ఇండిన్ ఆర్చరీ మినీ సబ్ జూనియర్ టీమ్‌కు ఎంపిక కానున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లడుతూ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌కు వీవీఐటీ వేదిక కావడం సంతోషంగా ఉందని, ఆర్చరీ వంటి క్రీడల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. 2030లో ఇండియాలో జరగనున్న పారా ఒలంపిక్స్ టోర్నమెంట్‌లో ఆర్చరీ క్రీడకు ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం ఇవ్వనుందని.. అది వీవీఐటీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకోబ్లిస్ ఇండియా సంస్థ సి.ఈ.ఓ ఏ.వి.పి.ఎస్ చక్రవర్తి. ఏపీ అర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వీవీఐటీ డెరెక్టర్ రావెల నవీన్, ఇండియన్ ఆర్చరీ క్రీడాకారుడు కె.వెంకటాద్రి, వీవీఐటీ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News