Tirumala: నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:32 AM
తిరుమలలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరుగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పుష్పాలంకరణలు, పంచాంగ శ్రవణం, నూతన వస్త్ర సమర్పణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

వేడుకలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైన తిరుమల
తిరుమల, మార్చి 29(ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది. శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉగాది ఆస్థానం జరుగనుంది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్ర్తాలు సమర్పిస్తారు. అలాగే పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. తర్వాత ఉగాది ఆస్థానాన్ని పండితులు ఆలయంలోని బంగారు వాకిలిలో శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. కాగా, ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సర్వాంగాసుందరంగా తీర్చిదిద్దారు. ధ్వజస్తంభం, బలిపీఠాన్ని లక్ష కట్ ఫ్లవర్లతో అలంకరించారు. ఇందులో ప్రత్యేకంగా అమెరికాలోని కాలిఫోర్నియా, కొలంబియా నుంచి తొలిసారిగా ట్రెసిలియం, డెల్ఫీనియం అనే పుష్పాలను తీసుకొచ్చి అలంకరించారు. అలంకరణల కోసం మనదేశంలో తొలిసారిగా వీటిని తిరుమలలో వినియోగించడం విశేషం. మరోవైపు.. వారాంతం కావడంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News