Waqf Bill: వక్ఫ్ బోర్డు నిర్ణయాలపై సవాల్
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:38 AM
వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసేందుకు మార్పులు చేయాలని కేంద్ర హోమమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏప్రిల్ 4న ముగిసే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో వక్ఫ్ బిల్లును ప్రవేశపెడతారని చెప్పారు

ఏ నిర్ణయంపై అయినా కోర్టుకు వెళ్లేలా బిల్లులో కీలక మార్పులు
బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు: అమిత్ షా
న్యూఢిల్లీ, మార్చి 29: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వక్ఫ్ బిల్లుపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత సెషన్‌లోనే వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. టైమ్స్ నౌ సమ్మిట్-2025లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి భిన్నంగా.. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కూడా కోర్టుల్లో సవాల్ చేసే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2013లో పార్లమెంట్‌లో సమగ్ర చర్చ చేపట్టకుండా వక్ఫ్ బిల్లును పాస్ చేయించుకుందని విమర్శించారు. బిల్లులోని చాలా నిబంధనలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా లేనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తన బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ విధంగా చేసిందని అన్నారు. ఏ చట్టమూ రాజ్యాంగం కంటే ఎక్కువేమీ కాదని అమిత్‌షా స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు ప్రస్తుత స్థితిని ప్రశ్నిస్తూ.. ‘‘వక్ఫ్ బోర్డు గనుక ఒక నిర్ణయం తీసుకుంటే, దాన్ని దేశంలోని కోర్టుల్లో సవాల్ చేసేందుకు అవకాశం లేదు. భారత్ వంటి దేశంలో ఈ పద్ధతిని ఏ విధంగా అనుమతించగలం’’ అని షా అన్నారు.
ఇవి కూడా చదవండి..
Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు
Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
For National News And Telugu News