India vs England: హైదరాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్
ABN , Publish Date - Jan 28 , 2024 | 08:45 AM
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బంతితో మాయాజాలం చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. విజృంభించి బంతులు సంధించే సమయంలో ఈ స్పిన్-మాంత్రికుడిని ఆడడం బ్యాట్స్‌మెన్లకు అంత సులభం కాదు. హైదరాబాద్‌లో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. బంతితో మాయాజాలం చేసి బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుంటాడు. విజృంభించి బంతులు సంధించే సమయంలో ఈ స్పిన్-మాంత్రికుడిని ఆడడం బ్యాట్స్‌మెన్లకు అంత సులభం కాదు. హైదరాబాద్‌లో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మూడో రోజు ఇంగ్లండ్ బ్యాటర్లను అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. అశ్విన్ కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లొ బెన్ స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ సంచలన ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్‌ను ఏకంగా 12వ సారి ఔట్ చేసి భారత్ బౌలర్‌గా అశ్విన్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన భారత బౌలర్‌గా మాజీ దిగ్గజం కపిల్ దేవ్, ఇషాంత్ శర్మల పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ను టెస్టుల్లో 11 సార్లు ఔట్ చేయగా, లెజెండరీ కపిల్ దేవ్ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రాహం గూచ్‌ను 11 సార్లు పెవీలియన్‌కు పంపించాడు. ఇక ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను 11 సార్లు ఔట్ చేసి ఇద్దరితో అశ్విన్ సమంగా ఉన్నాడు. అయితే బెన్ స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా ఒక బ్యాట్స్‌మెన్‌ను అత్యధికసార్లు ఔట్ చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు.
ఒక బ్యాట్స్‌మెన్ అత్యధికసార్లు ఔట్ చేసిన బ్యాటర్లు వీళ్లే..
రవి అశ్విన్ Vs బెన్ స్టోక్స్ - 12 సార్లు
రవి అశ్విన్ Vs డేవిడ్ వార్నర్ - 11 సార్లు
ఇషాంత్ శర్మ Vs అలిస్టెర్ కుక్ - 11 సార్లు
కపిల్ దేవ్ Vs గ్రాహం గూచ్ - 11 సార్లు
హర్భజన్ సింగ్ Vs రికీ పాంటింగ్ - 10 సార్లు
కపిల్ దేవ్ Vs అలెన్ బోర్డర్ - 10 సార్లు
కపిల్ దేవ్ Vs డీ గోవర్ - 10 సార్లు
కపిల్ దేవ్ Vs ఎం మార్షల్ - 10 సార్లు.