India vs England: ముగిసిన తొలిరోజు ఆట.. ఇంకొన్ని పరుగుల దూరంలోనే భారత్ | India vs England Fist Test First Day Innings Completed ABK
Share News

India vs England: ముగిసిన తొలిరోజు ఆట.. ఇంకొన్ని పరుగుల దూరంలోనే భారత్

ABN , Publish Date - Jan 25 , 2024 | 05:32 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు ఆట ముగిసింది. ఈ మొదటి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

India vs England: ముగిసిన తొలిరోజు ఆట.. ఇంకొన్ని పరుగుల దూరంలోనే భారత్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు ఆట ముగిసింది. ఈ మొదటి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు విజృంభించడంతో.. ప్రత్యర్థి జట్టు తక్కువ పరుగులకే చాపచుట్టేయాల్సి వచ్చింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (70) ఒక్కడే అర్థశతకంతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తన జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతని తర్వాత బెయిర్‌స్టో (37), బెన్ డకెట్ (35) మాత్రమే కాస్త పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి.. ఎక్కువసేపు క్రీజులో నిలకడగా రాణించలేకపోయారు. భారత బౌలర్ల గురించి మాట్లాడుకుంటే.. అశ్విన్, జడేజా తలా మూడు.. అక్షర్ పటేల్, బుమ్రా రెండు చొప్పున వికెట్లను పడగొట్టారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బరిలోకి దిగిన భారత జట్టు.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ భారత జట్టుకి శుభారంభాన్ని అందించారు. వీళ్లిద్దరు తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించారు. ఒకవైపు రోహిత్ నిదానంగా రాణిస్తే.. మరోవైపు జైస్వాల్ పరుగుల వర్షం కురిపించాడు. 47 బంతుల్లోనే అతడు అర్థశతకం చేశాడు. వీళ్లిద్దరు క్రీజులో కుదురుకోవడం కోసం.. తొలి రోజు ఆట ముగిసేవరకు వికెట్ కోల్పోరని అంతా అనుకున్నారు. కానీ.. దురదృష్టవశాత్తూ రోహిత్ శర్మ 24 వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. రోహిత్ వికెట్‌ని జాక్ లీచ్ పడగొట్టాడు. అటు.. జైస్వాల్ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. ఫలితంగా.. తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్కోరుని సమం చేయడానికి భారత్ మరో 127 పరుగుల దూరంలోనే ఉంది.

Updated Date - Jan 25 , 2024 | 05:32 PM