Home » IT Employee
కోరుట్ల పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మెట్‌పల్లి డీఎస్‌పీ రవీందర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కోరుట్ల పట్టణంతో పాటు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ఉంటున్న దీప్తి బంధువుల వివరాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దీప్తి అనుమానాస్పద మృతి మిస్టరీ కొనసాగుతోంది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.
కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంకి దీప్తి(24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీప్తి చెల్లెలు కనిపించకుండా పోవడంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికాకు చెందిన దిగ్గజ మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీ అమెజాన్ సంస్థ (Amazon) ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. వారంలో మూడు రోజుల పాటు ప్రతీ ఉద్యోగి ఆఫీస్‌కు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు అమెజాన్ సీఈవో ఆండీ జాసీ (Amazon CEO Andy Jassy) స్పష్టం చేశారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) ఇటీవలే ఎకరా రూ.వంద కోట్ల మార్క్ దాటింది. కోకాపేట నియోపోలిస్(Kokapet Neopolis) వేలంలో దాదాపు అన్ని ప్లాట్లు ఎకరా రూ.75-80 కోట్లకు అమ్ముడు పోయాయి.
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి శుభవార్తలు (Good News) ఎక్కువవుతున్నాయి.! ఆ మధ్య దివ్యాంగులకు పెన్షన్ వెయ్యి పెంపు, విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంపు, బీసీ బంధు, ముస్లింలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం ఇలా వరుస శుభవార్తలు చెప్పిన కేసీఆర్.. ఆదివారం నాడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేశారు..
రాష్ట్రంలో ఇంజనీరింగ్(Engineering) పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థుల(students) పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మంచి ఐటీ ఉద్యోగం(IT job), లక్షల రూపాయల ప్యాకేజీలపై గంపెడాశలతో ఉన్న వారికి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నిరాశకు గురి చేస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ (Hyderabad) కాస్త ‘హైజలాబాద్’గా మారిపోయింది. ఎడతెరిపిలేని వానలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది.! ముఖ్యంగా సోమవారం సాయంత్రం కురిసిన జడివాన దెబ్బకు ఐటీ కారిడార్లో (IT Corridor) భారీ ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది...
ఉద్యోగులకు TCS హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ పాలసీకి అనుగుణంగా ఆఫీసుకు రావాలని కోరింది. తక్షణమే ఉద్యోగులు ఆఫీసు లోకేషన్ నుంచి పనిప్రారంభించాలని కోరింది.
ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడగా గురువారం ఉదయం వెలుగుచూసింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో..