Home » Jammu and Kashmir
జమ్మూ కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
సార్వత్రిక ఎన్నికలతోపాటు స్పీకర్ ఎన్నిక సైతం పూర్తయింది. అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. అందులోభాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు ‘ఈ అంశం’పై సమావేశమై చర్చించారు.
అమర్నాథ్ తీర్థయాత్ర హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. పవిత్ర అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీ దర్శనం కోసం శివ భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలు దేరి వెళ్తారు. ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఉగ్రవాదులకు నిధుల అందజేస్తున్నాడనే కారణంగా అరెస్టయిన ఇంజినీర్ రషీద్.. లోక్సభలో సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అనుమతిచ్చింది. దీంతో అతడు ప్రమాణం చేసే తేదీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఖరారు చేయనుంది.
అమర్నాథ్ యాత్ర 2024(Amarnath Yatra 2024) నేడు (జూన్ 29న) ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూకశ్మీర్ గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు(pilgrims) బయలుదేరారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా దోడా జిల్లా బజాద్ గ్రామంలోని గండోహ్ ప్రాంతంలో బుధవారంనాడు ఉదయం 9.50 గంటల ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక టెర్రరిస్టు హతమయ్యాడు.
'సుస్థిరత'కే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందన్నారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day 2024) దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీనగర్(Srinagar)లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత సరిహద్దుల్లో మంచుతో ఉన్న ఎత్తైన శిఖరాల మధ్య ఆర్మీ సైనికులు నేడు యోగా డే సందర్భంగా యోగా సాధన చేశారు. అంతేకాదు మంచు మధ్య యోగా చేస్తూ సూర్య నమస్కారాలతో ఫిట్గా ఉండాలనే సందేశాన్ని కూడా సైనికులు ప్రజలకు అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్లోని షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో భాగస్వామి అవుతారు.