Home » Jammu and Kashmir
రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగినంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలు బాధితులుగానే మిగిలిపోతారని, తాను మాత్రమే కాకుండా జమ్మూకశ్మీర్లోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.
గందేర్బల్ నియోజకవర్గం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 1977లోనూ, ప్రస్తుత అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా 1983, 1987, 1996లోనూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
జమ్మూకశ్మీర్లో జరిగి ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. ఇండియాలో ఉగ్రవాద వ్యాప్తిని పాకిస్థాన్ ఆపేయాలని, న్యూఢిల్లీలో సత్సంబంధాలు కోరుకుంటే తక్షణం ఈ పని చేయాలని అన్నారు.
జమ్మూ-కశ్మీర్లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కొలువుతీరింది. శ్రీనగర్లోని షెరి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కొత్త సీఎంగా ఒమర్ అబ్దుల్లాతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా జమ్మూకు చెందిన
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే పోలీసులకు తొలి ఆదేశాలిచ్చారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. మెుత్తం 90సీట్లలో ఎన్సీ 42 స్థానాల్లో విజయం సాధించగా మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది.
హర్యానా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారు అయినట్లు సమాచారం. అక్టోబర్ 16వ తేదీన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అయితే శుక్రవారం సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉందని గుర్తు చేశారు.