PM Modi: సోన్‌మార్గ్ టన్నెల్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: మోదీ
ABN , Publish Date - Jan 11 , 2025 | 08:47 PM
సోన్‌మార్గ్ టన్నెల్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇందుకు సంబంధించి పెట్టిన ఒక పోస్టుపై ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. టన్నెల్ ప్రారంభోత్సవానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ (Sonmarg) ప్రాంతంలో రూ.2,700 కోట్లతో చేపట్టిన 'జడ్ మోడ్' టన్నెల్ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈనెల 13న ఈ టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించనున్నారు. ఈ టన్నెల్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇందుకు సంబంధించి పెట్టిన ఒక పోస్టుపై ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. టన్నెల్ ప్రారంభోత్సవానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. టన్నెల్ అందుబాటులోకి వస్తే పర్యాటకం, స్థానికంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలను చక్కగా వివరించారని సీఎంను అభినందించారు. టన్నెల్ ఫోటోలు, వీడియాలు చాలా బాగున్నాయని కూడా ప్రశంసించారు.
Priyanka Gandhi: మోదీజీ.. రూపాయి పతనంపై ఇప్పుడేమంటారు?
దీనికి మందు, ఒమర్ అబ్దుల్లా సోన్‌మార్గ్ టన్నెల్ ఫోటోలు, టన్నెల్ ప్రయోజనాలను వివరిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ''ప్రధాని సోమవారంనాడు సోన్‌మార్గ్ విచ్చేస్తున్నందున సన్నాహకాలను సమీక్షించేందుకు ఇక్కడ పర్యటించాను. జడ్ మోడ్ టన్నెల్ ఏడాదంతా తెరిచే ఉంటుంది. చలికాలంలో స్థానికులు ఈప్రాంతం విడిచి వెళ్లనక్కరలేదు. శ్రీనగర్ నుంచి కార్గిల్/లెహ్‌కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. దీంతోపాటు సోన్‌మార్గ్ టన్నెల్ పర్యాటకులకు ఎంతో అహ్లాదం కలిగిస్తుంది'' అని పేర్కొన్నారు.
కొండచరియలు విరిగిపడటం, మంచు కారణంగా రాకపోకల సమస్యను దృష్టిలో ఉంచుకుని 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఇవి కూాడా చదవండి..
Ram Mandir Anniversary: రాముడు ఉంటే దేశం ఉంది, దేశం ఉంటే రాముడు ఉన్నాడు: యోగి
Chennai: ముఖ్యమంత్రి పేరుతో ‘రీచార్జ్’..
Biscuits: అయ్యప్ప భక్తులకు 5 లక్షల బిస్కెట్లు
Read Latest National News and Telugu News