Home » Jammu and Kashmir
కశ్మీర్ పండిట్లకు నేషనల్ కాన్ఫరెన్స్ శత్రువు కాదని, ప్రభుత్వం అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తుందని ఎస్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూకశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు నేషనల్ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్ లాంఛనంగా మద్దతును ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శ్రీనగర్‌లో శుక్రవారంనాడు జరిపిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుతుంది. సొంతంగా 42 సీట్లలో ఎన్సీ గెలుపొందగా, భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి.
నేడు జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇటివల శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సీఎంగా పదవీ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయం గురించి వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారో ఇక్కడ చుద్దాం.
కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణపై నేషనల్ కాన్ఫరెన్స్ ) నేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే 370వ అధికరణను రద్దు చేశారో వారి నుంచి తిరిగి దానిని రాబట్టుకోవాలనుకోవడం నిష్ప్రయోజనమని అన్నారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది! ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది!
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రె్‌సకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టారని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాల తరబడి ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా దూరం పెడుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్లో ప్రజాస్వామ్యం గెలిచింది.