Home » Kanaka durga temple
భారతీయ సనాతన ధర్మంలోని మంత్ర శాస్త్రంలో పుష్కలంగా ఉన్న కొన్ని ప్రధానాంశాలతో, మరికొన్ని స్తోత్ర విద్యలతో, ఇంకొన్ని అందమైన వ్యాఖ్యానాలతో సుమారు మూడు వందల పేజీల శ్రీ సంపదగా ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్ర వైభవం’ను అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్త ధార్మిక కృషిని, రచనాపటిమను శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆలయ అర్చక, పండిత బృందాలు ముక్త కంఠంతో అభినందిస్తున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె .ఎస్. రామారావు పర్యవేక్షణలో శని, ఆదివారాలలో దేవస్థానానికి విచ్చేసిన వందలాది భక్తులకు ఈ అక్షర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది పంచడం భక్త సందోహాల్ని విశేషంగా ఆకర్షించింది.
వారాహి నవరాత్రుల పవిత్ర వేడుక సంరంభ సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ అపూర్వ రీతిలో ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంథం, మూడువందల పేజీల పరమ పవిత్ర స్తోత్ర, వ్యాఖ్యాన పారిజాతం ‘శ్రీ లలిత విష్ణు స్తోత్ర మంత్ర పేటిక’ను విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు వీణా వేడుక మధ్య సంగీతోత్సవానికి వెలుగుగా ఆవిష్కరించారు.
Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాడ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 4 వరకు ఈ మాసోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు తొలిసారెను సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు సారెను సమర్పించారు.
శ్రీవిద్యోపాసనలో అత్యంత ప్రధానమైన శ్రీదేవి ఖడ్గమాలానామాలతో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ పాదాల చెంత శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం తమ కుటుంబానికి ఎంతో ఎంతో సంతోషాన్నించ్చిందని భారతదేశమంతటా అనేక శాఖలతో విస్తరించిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు.
అమరావతి: రాజధాని రైతులు ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం(NDA government) అధికారంలోకి రావడంతో విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు అమరావతి రైతులు(Amaravati Farmers) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కాలినడకన బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో 29గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణ జిల్లా మణుగూరు నుంచి విజయవాడకు పాదయాత్ర కాలినడక ప్రారంభించారు.
సర్వసమర్ధులైన ప్రజాపాలకుడు చంద్రబాబు పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని పలువురు రాజకీయకులతో ప్రస్తావిస్తున్న సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య.. తనకి ఎంతో ఆత్మీయులైన ఆనం రామ నారాయణరెడ్డి విశేష రాజకీయానుభవం వున్న సంస్కారి అని, ఆనం పవిత్ర సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరమని చెబుతూనే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తో చర్చలు జరిపి నెల్లూరు జిల్లాలోని మహా నృసింహ క్షేత్రమైన పెంచలకోన శ్రీ నరసింహ స్వామివారి దేవస్థానానికి సమర్పించేలా ఆనం రామనారాయణ రెడ్డి దంపతుల చిత్రాలొకవైపు ప్రచురిస్తూ.. పరమాద్భుతమైన నృసింహ ఉపాసనలతో ‘జయ జయ శత్రుభయంకర’ అనే గ్రంధాన్ని పరమ పవిత్రంగా ప్రచురించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు.
దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.