Share News

ఇంద్రకీలాద్రిపై పురాణపండ శ్రీనివాస్ శివ స్వరం ‘శంభో మహాదేవ’: ‘కిమ్స్’ కృష్ణయ్యను ఈ.ఓ అభినందనలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:49 AM

దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇంద్రకీలాద్రిపై పురాణపండ శ్రీనివాస్ శివ స్వరం ‘శంభో మహాదేవ’: ‘కిమ్స్’ కృష్ణయ్యను ఈ.ఓ అభినందనలు

విజయవాడ, జూన్ 7: ఆలయాల సందర్శనం, ఆలయాల్లో ప్రశాంతంగా ప్రార్ధన చేసేసుకోవడం ద్వారా ఆధునిక మానవుని అంతరంగంలో మానసిక పరివర్తన అద్భుతమై మానవత్వ దైవత్వాలతో సంచరిస్తాడని ఇటీవల అనేక సందర్భాలలో ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు పేర్కొంటున్నారు. దుర్గమ్మ సన్నిధానంలో ఈ శుక్రవారం ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనాసంకలనం ‘సౌభాగ్య’ దివ్య గ్రంధాన్ని ఆయన ప్రశాంతంగా పారాయణం చేస్తూ కనిపించారు.

అనంతరం కె.ఎస్. రామారావును పలకరిస్తే.. ‘మానవుడి కష్టకాలంలో చేదోడు వాదోడుగా నిలిచి ధైర్యం చెప్పేవి, రక్షణ కల్పించేవి ఆలయాల్లోని అర్చనలు, ప్రార్ధనలు మాత్రమేనని.. ఇలా ప్రాణచైతన్యాన్నిచ్చే అద్భుత ధార్మిక గ్రంధాలను వేలకొలది భక్తులకు అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తున్న మానవవిలువల, భక్తి విలువల పుణ్యచరితులు... కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, నాటి శాసన సభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని కృష్ణయ్య సమర్పణాభావాన్ని దుర్గమ్మ తల్లి పుష్కలంగా ఆశీర్వదిస్తుందని’ చెప్పారు.

ఈ మహా కార్యంలో ప్రధానభూమికగా నిలిచిన పరమాద్భుత గ్రంధాల రచనా సంకలనకర్త, అసాధారణమైన వక్త పురాణపండ శ్రీనివాస్ అపురూప సౌందర్యాల శైలి, వందలకొలది అందాలు కల్లినట్లుండే పవిత్ర ముద్రణ ఎం నిస్వార్ధ యజ్ఞ భావనను శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు ప్రశంసించారు.

Chandrababu-Family.jpg

ఇదిలా ఉండగా ఈనెల పన్నెండవతేదీన ప్రమాణ స్వీకారం అనంతరం పదమూడు పద్నాల్గవ తేదీల్లో అమ్మవారి దర్శనార్ధం ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి దంపతులు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంకి వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే ఆలయ వర్గాలతో సంభాషిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే.. దుర్గమ్మ సన్నిధిలో పరమ పవిత్రతల ‘సౌభాగ్య’ లక్షప్రతుల ఉచిత వితరణకు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావుచే ప్రారంభించి మంగళ సంచలనానికి కారణభూతులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సౌజన్య హృదయులు బొల్లినేని కృష్ణయ్య మరొక శివకార్యానికి అంకురార్పణచేసి.. ఆలయంలో మల్లేశ్వర స్వామివారికి ‘శంభో మహాదేవ’ అంటూ ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ చేత వచ్చే సోమవారం ఒక అఖండ అక్షర నీరాజనాన్ని సమర్పించ పూనుకోవడం మరొక దైవీయ స్పృహగా చెప్పక తప్పదు.

EO-Ramarao.jpg

దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

అద్భుతాల, అమోఘాల, అపురూపాలను ఎంచక్కని భక్తి పారవశ్య గ్రంథాలుగా రచించి, సంకలనీకరించి పవిత్ర పేటికలుగా అందిస్తూ... నిస్వార్ధకు పెద్దపీట వేస్తూ ఆకట్టుకుంటున్న పురాణపండ శ్రీనివాస్ వేదాది విద్యల బలమైన కలం నుండే శివుడు మల్లేశ్వరునిగా అనేక పరిమళాలతో ‘శంభో మహాదేవ’గా ఇంద్రకీలాద్రిపై అక్షరాల వనాలమధ్య భక్తి తాండవంగా సాక్షాత్కరించబోతున్నట్లు ఆలయ అర్చక పండితులు ముక్తకంఠంతో చెప్పడం గమనార్హం.

Puranapanda-Srinivas.jpg

ఒక్కొక్క పవిత్ర కార్యంతో దేవాదాయశాఖలో పరమ శ్రేష్టమైన కార్యాలకు తెరతీస్తున్న, తరాలు చెప్పుకునేలా మంగళకార్యాలు నిర్మాణాత్మకంగా ఆచరించి, ఆశ్చర్యపరుస్తున్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావుపై ఉభయ రాష్ట్రాల భక్తజనులూ, పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులూ, వివిధ పీఠాధిపతులూ ప్రశంసలు వర్షిస్తున్నారు. పురాణపండ శ్రీనివాస్ యజ్ఞ భావనను, పవిత్ర సంకల్పాలను, మహా మహా అక్షర కార్యాలను ఈ.ఓ రామారావు అనేక సందర్భాలలో మహాసరస్వతీ అనుగ్రహ విశేషంగా, కనకదుర్గమ్మ కారుణ్యంగా అభివర్ణించారు.

Updated Date - Jun 08 , 2024 | 01:39 AM