Nithyananda Alive: నిత్యానంద క్షేమం... కైలాస వెబ్‌సైట్ వెల్లడి
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:45 AM
వివాదాస్పద గురువు నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన వెబ్‌సైట్ ‘కైలాస’ వెల్లడించింది. ఉగాది వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించడంతో మృతిచెందారని వచ్చిన వార్తలను ఖండించింది

చెన్నై, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద జీవించే ఉన్నారని ఆయన అధికారిక వెబ్‌సైట్ ‘కైలాస’ ప్రకటించింది. మార్చి 30వ తేదీన ఆయన ఉగాది వేడుకలు కూడా జరుపుకొన్నట్టు పేర్కొంది. నిత్యానంద సజీవ సమాధి అయ్యారంటూ ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనను కైలాస వెబ్‌సైట్ తీవ్రంగా ఖండించింది. నిత్యానందను అపఖ్యాతి పాల్జేసేందుకు, దురుద్దేశపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2020లో దేశం నుంచి పారిపోయి పసిఫిక్ దీవుల్లో ‘కైలాస’ పేరుతో ఓ దీవిని దేశంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News