Home » Leopard
రాత్రి 7 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ వెనుక భాగంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కొందరు అటుగా వెళ్తున్న ఈ ప్రాణిని చూసి వీడియోలు తీశారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులతో కలిసి..
భాగ్యనగరంలో చిరుత పులి హల్ చల్ చేసింది. చిరుతను చూసి స్థానికులు భయ భ్రాంతులకు గురి అయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చిరుత సంచారం కనిపించింది.
రాజమండ్రిలో చిరుత కలకల రేపింది. కడియం మండలంలో చిరుత సంచరిస్తోందని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కడియం, కడియపులంక, బుర్రెలంక గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో చిరుత సంచరిస్తోందని గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు( Lala Cheruvu )లో చిరుతపులి( Leopard ) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. రాజమండ్రిలో రెండు రోజులుగా చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. పులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
లాలాచెరువు(Lala Cheruvu)లో చిరుతపులి(Leopard) కనిపించిన దృశ్యాలు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు స్థానికులను కంటి మీద కునుగు లేకుండా చేస్తున్నాయి.
Andhrapradesh: శ్రీశైలంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం దేవస్థానం ఏఈఓ మోహన్ గృహంలోని కాంపౌండ్‌లో చిరుత పులి సంచారించింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. పాతాళగంగ మార్గంలోని ఇంటి ప్రహరీ గోడపై మంగళవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించింది.
ప్రకాశం జిల్లా: గిద్దలూరు మండలం, దేవనగరం సమీపంలో చిరుతపులి రెస్క్యూ ఆపరేషన్ రెండోరోజు కొనసాగుతోంది. పాత పేపర్ మిల్లు సమీపంలో ఉన్న గుంతలో నిన్న చిరుతపులి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ప్రధానిగా మోదీ జూన్ 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ మంత్రి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన వెనక ఓ చిరుత రావడం కనిపించింది. ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు.
తిరునల్వేలి జిల్లా పాపనాశం అటవీ రేంజ్ పరిధిలో వరుసగా మూడు చిరుత పులులు(Three leopards) బంధించి అటవీ శాఖ సిబ్బంది, వాటిని సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు. పాపనాశం రేంజ్ పరిధిలోని వెంబయాపురం, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు, ఆ ప్రాంత ప్రజలు పెంచుకుంటున్న మేకలు, వీధి కుక్కలను(Goats and stray dogs) హతమారుస్తున్నాయి.
శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది.