Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:12 PM
లాలూ ప్రసాద్ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆదివారంనాడు అమిత్‌షా మాట్లాడుతూ, లాలూ-రబ్రీ జంగిల్ రాజ్ కావాలో, నరేంద్రమోద-నితీష్ కుమార్‌ల అభివృద్ధి బాట కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. 65 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేదని మోదీ పదేళ్లలో చేసి చూపించారని చెప్పారు.

పాట్నా: ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు జంగిల్‌రాజ్‌ను కోరుకుంటారో, మోదీ సారథ్యంలో అభివృద్ధిని కోరుకుంటారో తేల్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత సోనియాగాంధీ బీహార్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే బీహార్ అభివృద్ధి బాట పట్టిందని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు తిరిగి పట్టం కట్టాలని, ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని వరదల నుంచి విముక్తి కలిగిస్తామని భరోసా ఇచ్చారు.
PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ
లాలూ ప్రసాద్ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆదివారంనాడు అమిత్‌షా మాట్లాడుతూ, లాలూ-రబ్రీ జంగిల్ రాజ్ కావాలో, నరేంద్రమోద-నితీష్ కుమార్‌ల అభివృద్ధి బాట కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. 65 ఏళ్లుగా కాంగ్రెస్ చేయలేదని మోదీ పదేళ్లలో చేసి చూపించారని చెప్పారు. బీహార్‌లో లాలూ-రబ్రీ హయాం, కేంద్రలో సోనియా-మన్మోహన్ ప్రభుత్వం హయాంలో బీహార్‌కు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు లాలూ కుమారులిద్దరూ సీఎం పదవి కోసం సిద్ధమవుతున్నారని, ఆయన భార్య రబ్రీదేవి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉందని అన్నారు. తన కుటుంబాన్ని చక్కిదిద్దుకోవడంలో లాలూ బీజీగా ఉన్నారని, రాష్ట్రంలోని యువత గురించి మాత్రం ఏమాత్రం పట్టింపులేదని, నరేంద్ర మోదీ మాత్రం యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పారు.
బీహార్‌లో జానకీ మందిరం
నరేంద్రమోదీ ప్రభుత్వం అయోధ్యలో రామమందిరం నిర్మించినట్టే బీహార్‌లోనూ మాతా జానకి మందిరం నిర్మించే యోచనలో ఉన్నారని అమిత్‌షా చెప్పారు. ఛాత్ పండుగకు సెలవులను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. బీహార్ అభివృద్ధికి కేంద్రం రూ.9 లక్షల కోట్లు కేటాయించిందని, 13 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణం కానున్నాయని, రూ.8,000 కోట్లతో ఏడు వంతెనలు నిర్మిస్తామని, బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. బీహార్ అభివృద్ధికి కట్టుబడిన మోదీ-నితీష్ నాయకత్వాన్ని తిరిగి బీహార్ ప్రజలు గెలిపించాలని కోరారు.
గుజరాత్ జంగిల్ రాజ్ హీరో మీరే: ఆర్జేడీ
ఆర్జేడీ హయాంను జంగిల్ రాజ్‌గా పోలుస్తూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్ తిప్పికొట్టారు. గుజరాత్ జంగిల్ రాజ్ హీరోగా అమిత్‌షాను ఆయన అభివర్ణించారు. "బీహార్‌లో 20 ఏళ్లు జేడీయూ-బీజేపీ ప్రభుత్వమే ఉంది. శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బీహార్ అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందే చెప్పాలి. విద్య, తలసరి ఆదాయం, పెట్టుబడుల విషయంలో బీహార్ విఫలమైంది. వలస కార్మికుల్లో బీహార్ ప్రజలే అగ్రస్థానంలో ఉన్నారు. బీహార్‌ను కొల్లగొట్టడం మినహా ఎన్డీయే చేసిందేమీ లేదు'' అని శక్తి యాదవ్ అన్నారు. బీహార్ ప్రజలకు ఈ వాస్తవాలన్నీ తెలుసుననీ, వారు రాష్ట్రంలో మార్పునే కోరుకుంటున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్
Yatnal: కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా
For National News And Telugu News