Financial Planning: ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:10 PM
కోటి రూపాయలు సంపాదించాలని అనేక మందికి ఉంటుంది. అయితే దీనిని కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ స్కీం ద్వారా సంపాదించాలని చూస్తున్నారా. అందుకోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. కానీ రిస్క్ లేకుండా రిటర్స్న్ రావాలని చూస్తున్నారా. అందుకోసం ప్రభుత్వ స్కీం కావాలని అనుకుంటున్నారా. అయితే దీనికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీం బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో పెట్టుబడి చేసిన మొత్తంపై ప్రతి ఏడాది కూడా వడ్డీకి వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనిలో కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత మొత్తం పెట్టుబడి చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
PPF ఖాతాలో 6,000 రూపాయలు పెట్టుబడి చేస్తే …
మీరు PPF ఖాతాలో ప్రతి నెలా రూ. 6,000 జమ చేస్తే, 1 సంవత్సరంలో రూ. 72,000 జమ అవుతుంది. ఆ క్రమంలో మీరు ఇలా 25 సంవత్సరాలపాటు చేస్తే, మీరు మొత్తం డిపాజిట్ చేసిన మొత్తం రూ. 18 లక్షలు అవుతుంది. కానీ మీకు 7.1% వార్షిక వడ్డీ రేటుతో మీరు 25 ఏళ్ల తర్వాత దాదాపు రూ. 50 లక్షల పొందుతారు. ఈ క్రమంలో మీరు దాదాపు 31,47,847 రూపాయలు వడ్ రూపంలోనే పొందుతారు. కానీ చివరకు మొత్తం రూ.49,47,847 రూపాయలు అవుతుంది.
PPFలో రూ. 12,000 పెట్టుబడి పెడితే
ఇదే సమయంలో మీరు PPF ఖాతాలో ప్రతీ నెలా రూ. 12,000 జమ చేస్తే, 1 సంవత్సరంలో మొత్తం 1.44 లక్షలు జమ అవుతాయి. ఆ క్రమంలో 25 సంవత్సరాల్లో మొత్తం 36 లక్షల డిపాజిట్ అవుతుంది. ఆ క్రమంలో మీకు ప్రస్తుత వడ్డీ రేటు 7.1% ప్రకారం చూసినా కూడా, మీరు 62,95,694 రూపాయలు పొందవచ్చు. ఈ విధంగా, మొత్తం 98,95,694 రూపాయలు లభిస్తుంది. అంటే దాదాపు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పవచ్చు.
చివరగా...
PPFలో సురక్షితమైన పన్ను ప్రయోజనాలతోపాటు మంచి రాబడి కూడా లభిస్తుంది. మీరు దీని ద్వారా క్రమంగా ప్రగతి సాధించి, 25 సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు స్టాక్ మార్కెట్ పడిపోయినా కూడా మీకు ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి అసలు రిస్క్ వద్దనుకునే వారికి ఇది బెస్ట్ స్కీం అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News