Share News

Leopard: భాగ్యనగరంలో చిరుత పులి కలకలం.. భయం గుప్పిట్లో స్థానికులు

ABN , Publish Date - Oct 18 , 2024 | 09:10 PM

భాగ్యనగరంలో చిరుత పులి హల్ చల్ చేసింది. చిరుతను చూసి స్థానికులు భయ భ్రాంతులకు గురి అయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‎లోని మియాపూర్‎లో చిరుత సంచారం కనిపించింది.

Leopard: భాగ్యనగరంలో చిరుత పులి కలకలం.. భయం గుప్పిట్లో స్థానికులు

హైదరాబాద్: భాగ్యనగరంలో చిరుత పులి హల్ చల్ చేసింది. దాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత కదలికలు కనిపించాయి. ఈ మేరకు పలువురు యువకులు దానిని వీడియో తీశారు. అనంతరం మెట్రో అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు.


అప్రమత్తమైన పోలీసులు మియాపూర్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అది కంటపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్థానికుల సాయంతో చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీడియోలో ఒకే చిరుత కనిపిస్తోంది. పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏమైనా చిరుతలు ఉన్నాయేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు

'ఆప్' మాజీ మంత్రికి బెయిల్

మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ బైక్.. ఫీచర్లు తెలిస్తే

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 18 , 2024 | 09:42 PM