Share News

Leopard: హైదరాబాదీలూ హై అలర్ట్.. నగరంలోకి ప్రవేశించిన చిరుత

ABN , Publish Date - Apr 29 , 2024 | 09:34 AM

శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది.

Leopard: హైదరాబాదీలూ హై అలర్ట్.. నగరంలోకి ప్రవేశించిన చిరుత

హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతంలో ఓ చిరుత(Leopard) కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆందోళన కలిగిస్తోంది. చిరుత రింగ్ రోడ్డులోపలికి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ 27న అర్ధరాత్రి చిరుతపులి కనిపించింది.

విమానాశ్రయంలోని ఎయిర్‌క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్‌లోని కంచెపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


ఎయిర్‌పోర్టు సిబ్బంది చిరుతను గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో శంషాబాద్‌, యాచారం, మొయినాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో చిరుతపులులు సాధారణంగానే కనిపిస్తుంటాయి. చిరుతపులులు ఆహారం, నీటి కోసం మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి. ఇవి ఎక్కువగా వీధి కుక్కలను వెంటాడుతాయి. మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.

For more latest News and Telangana News

Updated Date - Apr 29 , 2024 | 10:38 AM