Home » Loans
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.
భారతదేశంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ విధానంలో సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఆర్బీఐ ULI (యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్) పేరుతో ఓ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని గవర్నర్ తెలిపారు.
ప్రస్తుతం గణేష్ చతుర్థి, నవరాత్రి, దసరా పండుగల సీజన్ వచ్చేస్తుంది. ఈ సమయంలో అనేక మంది కార్ కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అనేక మంది మాత్రం కార్ లోన్(car loans) కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పంట రుణాలు రూ.2లక్షల్లోపు బకాయిలున్న రైతుల్లో.. కుటుంబ నిర్ధారణ జరగని కుటుంబాలు 4,24,873 ఉన్నట్లుగా గుర్తించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రూ.2 లక్షల రుణమాఫీకి(Loan Waiver) కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకుంటున్న అప్పుల సగటు కాల పరిమితి(టర్మ్) నానాటికీ పెరిగిపోతోంది. గతంలో సగటు కాల పరిమితి 10-12 ఏళ్లు ఉండగా.. ఇప్పుడది 19 ఏళ్లకు పెరిగింది.
మీరు హోమ్ లోన్(home loan) తీసుకున్నారా. ఈ క్రమంలో మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని ఆశించారా. అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం (ఆగస్టు 8న) వరుసగా 9వ సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహ రుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు.
రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.
రుణాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తూర్పారబట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వరంగ కార్పొరేషన్ల కోసం తీసుకున్న పూచీకత్తు రుణాల వివరాలను గోప్యంగా ఉంచిందని ఆరోపించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కోసం తీసుకున్న రుణాల వివరాలనూ బహిర్గతపర్చలేదని దుయ్యబట్టింది.