Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
ABN , Publish Date - Nov 29 , 2024 | 01:18 PM
చాలా మంది రుణాలు తీసుకుంటారు. కానీ అవసరానికి మించి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ రుణాలను ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అనేక మంది వారి అవసరాలను తీర్చుకోవడానికి కొన్ని చోట్ల అప్పులు (Debts) చేస్తారు. ఫోన్, కారు కొనాలన్నా, సొంత ఇల్లు కావాలన్నా ఇలా ప్రతి దానికి పలువురు రుణాలు (loans) తీసుకుంటున్నారు. తీసుకోవడం సులభమే. కానీ వాటిని తీర్చేందుకు మాత్రం అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే తీవ్రంగా అప్పులు ఉన్న సమయంలో సులభంగా వాటిని తీర్చాలంటే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆదాయం పెంచుకోవాలి
మీరు త్వరగా రుణాన్ని చెల్లించాలనుకుంటే, ముందుగా మీ ఆదాయం పెంచుకునే ప్లాన్ చేయాలి. లేదంటే మీరు చెల్లించలేని పరిస్థితి ఉంటే, లోన్ వాయిదాలను కొన్ని నెలలు ఆపాలని ఆయా బ్యాంకులు లేదా సంస్థలను కోరండి. మీ ఆదాయం పెరిగిన తర్వాత మొత్తాన్ని ఒకేసారి చెల్లించుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటారు.
మళ్లీ లోన్ తీసుకోవడం
మీరు అధిక వడ్డీ రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను కలిగి ఉంటే మీరు నెమ్మదిగా ఆర్థిక వినాశనం వైపు వెళ్తున్నారని చెప్పవచ్చు. కాబట్టి అన్ని రుణాల నుంచి విముక్తి పొందేందుకు మీరు తక్కువ వడ్డీ రుణాన్ని తీసుకోవడం బెస్ట్ అని చెప్పవచ్చు. మీ బకాయిలన్నింటినీ తిరిగి చెల్లించడంలో అది మీకు సహాయపడుతుంది
EMIలుగా మార్చండి
క్రెడిట్ కార్డ్ బిల్లుల రూపంలో అప్పు ఎక్కువగా ఉంటే వాటిని EMIలుగా మార్చుకోవడం ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. దీని కోసం మీరు మీ బ్యాంక్ అప్లికేషన్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును EMIగా మార్చడానికి అభ్యర్థించవచ్చు. లేదా ఆన్ లైన్ విధానంలో కూడా మీరు EMI ఎంపికలకు మార్చుకోవచ్చు.
ఈ డిపాజిట్లు
మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ జీవిత బీమా పాలసీ లేదా FD వంటివి మీ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. PPF లేదా FD వంటి పెట్టుబడి పద్ధతులు మీ రుణం నుంచి మీమ్మల్ని ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
ఇతర మార్గాలు
వార్షిక బోనస్‌లు లేదా మీ జీతంలో పెరుగుదల లేదా వారసత్వంగా వచ్చిన డబ్బు, ఆస్తి తనఖా వంటి మార్గాలు కూడా మీ లోన్ చెల్లింపులకు సహాయపడతాయి. ఈ మార్గాల ద్వారా వచ్చిన నగదుతో మిమ్మల్ని మీరు అప్పు లేకుండా మార్చుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్ వినియోగం పరిమితం
అప్పులు తీర్చిన తర్వాత మీరు రెండో ఆలోచన లేకుండా మీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం అలవాటును తగ్గించండి. ఈ హానికరమైన అలవాటును పూర్తిగా మానేయండి. ఇకపై మీ డెబిట్ కార్డ్‌ని మాత్రమే ఉపయోగించండి. తద్వారా మీరు ఖర్చు చేస్తున్న ప్రతి కొనుగోలు విషయం గురించి తెలుస్తుంది. దీంతోపాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉందో అనేది మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
BSNL: మరో అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More Business News and Latest Telugu News