Share News

Bank Charges on Personal Loan: లోన్ తీసుకుంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:47 PM

Personal Loan Rules: లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఫైనాన్స్ ఏజెంట్లు ఎక్కువ లోన్ ఇస్తామని చెబుతున్నారా? అయితే, మీరు లోన్ తీసుకోవడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి తెలుసుకోకపోతే.. భవిష్యత్‌లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి ఆ రూల్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Bank Charges on Personal Loan: లోన్ తీసుకుంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..
Personal Loan Rules

Bank Loan Rules: డబ్బు అత్యవసరమా? పర్సనల్ లోన్(Personal Loan) తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే లోన్ తీసుకోవడానికంటే ముందే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. లేదంటే.. లోన్ తీసుకున్న తరువాత మీరు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకుని, బ్యాంకు వారిని తప్పక అడగాల్సిన అంశాలివి. ఒకవేళ మీరు బ్యాంకు(Bank Rules) నుంచి సమాచారం తెలుసుకోకపోతే మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బంది ఎదురైనప్పుడు అప్పులు తీసుకోవడం సహజం. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే.. చాలా మంది బ్యాంకులను ఆశ్రయిస్తారు. బ్యాంకు ద్వారా అవసరమైన లోన్ తీసుకుని.. అప్పులు తీర్చడం సహా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బ్యాంకు ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా ఈజీ కూడా. అయితే, పర్సనల్ లోన్స్‌కి కొన్ని ఛార్జీలను బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు స్వయంగా చెప్పరు. కానీ, పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారు తప్పనిసరిగా ఆ ఛార్జీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి. పర్సనల్‌ లోన్‌కు సంబంధించి బ్యాంకుల రూల్స్ ఓసారి చూద్దాం.


ప్రాసెసింగ్ ఛార్జీలు: పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు.. ప్రాసెసింగ్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ రుసుము సాధారణంగా లోన్ మొత్తంలో 1% నుండి 3% వరకు ఉంటుంది. రుణం మంజూరు చేయడానికి ముందు ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ లోన్‌ అమౌంట్‌లో కట్ అవుతుంది. అందుకే.. ఈ చార్జీలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

లేట్ పేమెంట్ పెనాల్టీ: మీరు లోన్ తీసుకుని.. ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు పెనాల్టీని విధిస్తాయి. వివిధ బ్యాంకులు తమ నిబంధనల ప్రకారం ఈ ఛార్జీలను నిర్ణయిస్తాయి. అయితే, దీనిపై బ్యాంకులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వవు. అందుకే.. వీటి గురించి ముందుగానే తెలుసుకోవాలి. అలాగే.. ఈ పెనాల్టీలను నివారించాలంటే.. టైమ్‌ ప్రకారం ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.


స్టేట్‌మెంట్ కాపీపై ఛార్జీలు: పర్సనల్ లోన్‌లపై స్టేట్‌మెంట్ కాపీని జారీ చేసినందుకు ఛార్జీలు విధిస్తారు. ఈ రుసుమును బ్యాంకు నిర్ణయిస్తుంది. సాధారణంగా బ్యాంకులు 100 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తాయి. పర్సనల్ లోన్ స్టేట్‌మెంట్ అన్ని రుణ సంబంధిత లావాదేవీల రికార్డును కలిగి ఉంటుంది. ఇందులో వడ్డీ రేటు, బకాయి, పేమెంట్ హిస్టరీ, గడువు తేదీ, ఇతర ఛార్జీలకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి.

GST, ఇతర పన్నులు: పర్సనల్ లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు, ప్రీ-పేమెంట్ ఛార్జీలు, ఎన్‌రోల్‌మెంట్ ఛార్జీలు మొదలైన వాటిపై GST వర్తిస్తుంది. ఈ పన్నులు మీ లోన్‌ను పెంచుతాయి. వాస్తవానికి, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లపై GST వర్తించదు.

ప్రస్తుత కాలంలో లోన్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు కస్టమర్లకు వివిధ రకాల రుణాలను అందిస్తున్నాయి. రుణ గ్రహీతలు రుణాన్ని పొందే ముందు ప్రీ పేమెంట్ నియమాలు, వడ్డీ రేటు, ఇతర ఛార్జీలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.


Also Read:

రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్

సైఫ్ కేసు.. వాళ్లే చంపాలనుకున్నారా

కొంప ముంచిన పిల్లి.. ఉద్యోగం లేదు, బోనస్ లేదు..

For More Business News and Telugu News..

Updated Date - Jan 22 , 2025 | 05:47 PM