Share News

Waqf Bill: వక్ఫ్ బిల్లు ఉభయసభల్లో పాసవుతుందా? ఎన్డీయేకున్న బలమెంతంటే..

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:21 PM

దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్‌సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

Waqf Bill: వక్ఫ్ బిల్లు ఉభయసభల్లో పాసవుతుందా? ఎన్డీయేకున్న బలమెంతంటే..

న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf Amendment Bill) ఎట్టకేలకు లోక్‌సభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి కిరిణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చర్చను ఆయనే స్వయంగా ప్రారంభించారు. 8 గంటల సేపు సభలో బిల్లుపై చర్చ జరగనుంది. అవసరమైతే మరికొంత సేపు పొడిగించే అవకాశం కూడా ఉంది. చర్చ పూర్తికాగానే ఓటింగ్ నిర్వహించనున్నారు.

Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరలకు చోటు లేదు: అమిత్‌షా


బిల్లుపై ఎవరి వాదన ఎలా ఉంది?

వక్ఫ్ పాలకవర్గాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే బిల్లు ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. ఇందుకోసం బిల్లులో మహిళా భాగస్వామ్యాన్ని కూడా తప్పనిసరి చేశారు. మొత్తం 40 సవరణలు బిల్లులో చోటుచేసుకున్నాయి. దేశ ప్రజల మద్దతు బిల్లుకు ఉందని లోక్‌సభలో చర్చ సందర్భంగా అధికార పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన వ్యహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనికి చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వివరణ సైతం ఇచ్చారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ఆ విధంగా తాము చేయాలని కూడా కోరుకోవడం లేదని, మతపరమైన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టత ఇచ్చారు.


పార్లమెంట్‌లో బలాబలాలు?

పార్లమెంటులో సంఖ్యాపరంగా చూసుకుంటే వక్ఫ్ సవరణ బిల్లును బీజేపీ సునాయాసంగా గట్టించే అవకాశం ఉంది. 543 మంది సభ్యుల లోక్‌సభలో బేజీపీ సారథ్యంలోని ఎన్డీయేకు 294 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ సంఖ్యా బలం 240. బిల్లు ఆమోదం పొందడానికి 272 ఓట్లు అవసరం. ప్రతిపక్షాల విషయానికొస్తే కాంగ్రెస్‌కు గరిష్టంగా 99 మంది ఎంపీలు ఉండగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిపి వారి బలం 233.


కాగా, బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన అనంతరం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. 236 మంది సభ్యుల రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి 119 సభ్యుల బలం అవసరం. బీజేపీకి ఆరుగురు నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు ఇండిపెండెంట్లతో సహా 126 మంది సభ్యులు ఉన్నందున బిల్లు గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 08:23 PM