Share News

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:06 PM

కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2024 (Waqf Amendment Bill) కేవలం ఒక బిల్లు కాదని, ఉమ్మీద్ (Unified Waqf Management Empowerment, Efficiency and Devilopment) అని, సాధికారత, సామర్థ్యం అభివృద్ధిని ఉద్దేశించినదని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) అన్నారు. బిల్లుపై బుధవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, దేశ ప్రజలంతా వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలుసుతున్నారని అన్నారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ భారత్, కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఆలిండియా సూఫీ కౌన్సిల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ మద్దతు ప్రకటించాయని తెలిపారు.

Waqf Bill: ఓట్లతో వ్యాపారం మానుకోవాలి.. విపక్షాలకు రవిశంకర్ ప్రసాద్ చురకలు


కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని అన్నారు. వక్ఫ్ ల్యాండ్‌ల్లో అవినితీకి పాల్పడినందు వల్లే వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఈ సవరణ చట్టం చరమగీతం పాడుతుందన్నారు.


ఆ తప్పు మళ్లీ జరగనీయం

మతం ఆధారంగానే 1947లో దేశ విభజన జరిగిందని, మరోసారి మతం పేరుతో దేశ విభజన జరగనీయమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అప్పట్లో దేశవిభజనకు ఒక కుటుంబం, ఒక పార్టీ కారణమైందని విమర్శించారు. ఈ రోజు 'ల్యాండ్ జీహాద్' పేరుతో మరోసారి దేశ విభజనను జరగనీయమని అన్నారు. వక్ఫ్ బోర్డు భయాల నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 06:13 PM