Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరలకు చోటు లేదు: అమిత్‌షా
ABN , Publish Date - Apr 02 , 2025 | 07:30 PM
ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహేనని, కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా అన్నారు.

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ముస్లింల మతపరమైన వ్యవహరాల్లో ఎలాంటి జోక్యం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) భరోసా ఇచ్చారు. కేవలం ఓటు బ్యాంకు భయాల వల్లే ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో, విరాళాలుగా వచ్చిన ఆస్తుల విషయంలో వక్ఫ్ బిల్లు జోక్యం చేసుకుంటుందనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరలకు చోటు లేదని బిల్లుపై బుధవారంనాడు చేపట్టిన చర్చ సందర్భంగా అమిత్‌షా స్పష్టం చేశారు.
Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్
"వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చాయి. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేరుస్తామని, వక్ఫ్‌లో జోక్సం చేసుకుంటామని కొందరు వాదనలు చేస్తున్నారు. మొదటగా వక్ఫ్ బోర్డులో ఏ ముస్లిమేతరులు ఉండరని నేను చెప్పదలచుకున్నాను. అలాంటి ప్రొవిజన్ ఏదీ ఇందులో లేదు. అలా చేయాలని కూడా మేము కోరుకోవడం లేదు. ముస్లింల మత పరమైన కార్యక్రమాల్లో, వాళ్లు విరాళాలుగా ఇచ్చిన ఆస్తుల్లో జోక్యం చేసుకుంటామనేది కూడా పూర్తిగా అపోహే. కేవలం ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి" అని అమిత్‌షా పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సభలో జరుగుతున్న చర్చలను చాలా జాగ్రత్తగా వింటున్నానని, కొందరి సభ్యుల్లో తప్పుడు అపోహలు ఉన్నాయని, అవి సహజమైనవి కావచ్చు, రాజకీయమైనవి కూడా కావచ్చని అన్నారు. సభ ద్వారా తప్పుడు అపోహలు వ్యాప్తి చేసే ప్రయత్నం కూడా కావచ్చని అన్నారు.
కాంగ్రెస్‌పై అమిత్‌షా విమర్శలు గుప్పిస్తూ, 2014 ఎన్నికలకు ముందు న్యూఢిల్లీలోని 123 వీఐపీ ఆస్తులను వక్ఫ్‌బోర్డుకు కాంగ్రెస్ పార్టీ డొనేట్ చేసిందని చెప్పారు. 2013లో కూడా వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా రైల్వే భూమిని వక్ఫ్‌కు డొనేట్ చేసిందన్నారు. 2013లో వక్ఫ్‌కు సవరణలు ప్రవేశపెట్టినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కఠినమైన చట్టాన్ని తాము కోరుకుంటున్నామని, దోపిడీలకు పాల్పడే వారికి జైలులో పెడతామని చెప్పారని, లాలూ ప్రసాద్ ఆకాంక్షలను ఇప్పుడు నరేంద్ర మోదీ నెరవేర్చనున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News