
Breaking News: వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విక్రమాదిత్య
ABN , First Publish Date - Apr 02 , 2025 | 10:48 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-02T19:56:17+05:30
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విక్రమాదిత్య సింగ్
వక్ఫ్ సవరణ బిల్లుపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు.. ఈ బిల్లుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు.
-
2025-04-02T18:39:03+05:30
మతపరమైన ఉద్రిక్తతలకు ఛాన్సే లేదు: అమిత్ షా
‘వక్ఫ్ అనేది అరబిక్ పదం. వక్ఫ్ అంటే అల్లాహ్ పేరు మీద ఆస్తిని దానం చేయడం. వక్ఫ్ అనేది ఒక దాతృత్వ నిధి. నేను వేరొకరి ఆస్తిని దానం చేయలేదు. మీరు మీకు సంబంధించి ఏదైనా దానం చేయండి. వక్ఫ్‌లకి ముస్లిమేతరులను అనుమతించరు. వక్ఫ్ బిల్లులో సవరణలు మతాల మధ్య ఉద్రిక్తతను సృష్టించవు.’ అని అమిత్ షా అన్నారు.
-
2025-04-02T18:33:14+05:30
అదంతా తప్పుడు ప్రచారం: అమిత్ షా..
‘వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదు. కొంతమంది మైనారిటీలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మతపరమైన ఆస్తులను చూసుకునేవారు, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండరు. మేము అందులో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ పరిషత్‌లలో ముస్లిమేతరులు ఉంటారంటూ ప్రతిపక్షం మైనారిటీలను భయపెట్టి వారి ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోంది.’ అని కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌సభలో విమర్శించారు.
-
2025-04-02T18:21:42+05:30
వక్ఫ్ భయం నుంచి విముక్తి పొందాలి: అనురాగ్ ఠాకూర్
వక్ఫ సవరణ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్.. ప్రతిపక్షాలపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. ‘ఇది బిల్లు కాదు. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్(UMMEED). ఈ ఉమ్మీద్‌లో సాధికారత, సామర్థ్యం, అభివృద్ధి ఉన్నాయి. దీనిని పూర్తిగా పరిశీలిస్తే దేశ ప్రజలంతా మద్ధతిస్తారు. కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ భారత్, కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాషిన్ కౌన్సిల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ వంటి అనేక సంస్థలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వక్ఫ్‌ను సవరించాల్సిన సమయం ఆసన్నమైంది. దారుణాలకు, అవినీతికి కేరాఫ్‌గా మారింది. ఇలాంటి అన్యాయాలకు ముగింపు పలికి, సవరించాల్సిన సరైన సమయం ఇదే. భారతదేశానికి వక్ఫ్ భయం నుంచి విముక్తి అవసరం. కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన ఈ వక్ఫ్ చట్టాన్సి సవరించాల్సిందే.’ అని అనురాగ్ ఠాకూర్ ఉద్ఘాటించారు.
-
2025-04-02T17:50:40+05:30
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లు.. మరి బీజేపీకి బలముందా..
వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడమే ఈ బిల్లు లక్ష్యం అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఈ వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌లో పాస్ కావాలంటే.. బీజేపీ సర్కార్‌కు సరిపడినంత సంఖ్యా బలం ఉండాలి. మరి ఉందా.. అనే సందేహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బీజేపీకి 240 ఎంపీలు ఉన్నారు. ప్రధాన మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ సహా ఇతర మిత్రపక్షాలతో కలిపి 295 ఎంపీల సపోర్ట్ ఉంది. దీంతో ఈ బిల్లు లోక్‌సభలో పాస్ అవడం చాలా సులభమనే చెప్పాలి. లోక్‌సభలో బిల్లు పాసైన తరువాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
-
2025-04-02T14:28:17+05:30
లోక్‌సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య ఆసక్తికర చర్చ
వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య ఆసక్తికర చర్చ
బీజేపీ తీసుకునే నిర్ణయాలు ఫెయిల్యూర్ నిర్ణయాలు
పెద్ద నోట్ల ఉపసంహరణ, రైతు చట్టాలు ఇలా అన్ని వైఫల్యాలే
వక్ప్ బిల్లుతో బీజేపీ తన వైఫల్యాలకు మేకప్ వేసినట్లుంది
ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమన్న అఖిలేష్
వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడిని నియమించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతోంది
ఆ పార్టీ అధ్యక్షలు ఎవరో తేల్చుకోలేకపోతుందన్న అఖిలేష్ యాదవ్
అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్
మీ కుటుంబంలోని ఐదుగురికే అన్ని పదవులు
ఐదుగురి ఆమోదంతో మీ పార్టీ అధ్యక్షుడిని నియమిస్తారు
బీజేపీలో అలా కుదరదు.. పార్టీకి ఓ విధానం ఉంటుంది
కోట్లాది మంది కార్యకర్తల అభిప్రాయంతోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు
కొంత సమయం పడుతుంది
-
2025-04-02T13:27:08+05:30
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్
వక్ఫ్ బిల్లు ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉంది
ఈ బిల్లు కొందరిలో లేని అపోహలు కలిగిస్తోంది
కేంద్రప్రభుత్వం పక్షపాతంతో వ్యవహారిస్తోంది
వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి
-
2025-04-02T13:15:49+05:30
వక్ఫ్ బిల్లులో నిజాలు ఇవే.. లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
రైల్వేభూములతో వక్ఫ్ భూములు పోల్చలేము
వక్ఫ్ బిల్లులో అంశాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
ఓటు బ్యాంకు రాజకీయాలను విపక్షాలు మానుకోవాలి
-
2025-04-02T12:50:14+05:30
లోక్‌సభలో కిరణ్ రిజిజు
విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు తావులేదు
ఓవర్గాన్ని విపక్షాలు రెచ్చగొడుతున్నాయి
పేద ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు
ఈ బిల్లు ఎవరికి వ్యతిరేకం కాదు
-
2025-04-02T12:38:18+05:30
లోక్‌సభలో కిరణ్ రిజిజు
మైనార్టీల్లో విపక్షాలు అనవసర భయాన్ని సృష్టిస్తున్నాయి
కొత్త బిల్లు భూములకు రక్షణ కల్పిస్తుంది
-
2025-04-02T12:25:12+05:30
లొక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
బిల్లుపై విస్తృతంగా చర్చించాం
ఎంతోమంది అభిప్రాయాలు సేకరించాం
మత సంస్థలు, మేధావుల అభిప్రాయాలు సేకరించాం
వివిధ పార్టీల అభిప్రాయాలను జేపీసీ పరిగణలోకి తీసుకుంది
-
2025-04-02T12:20:19+05:30
వక్ఫ్ బిల్లుపై అభ్యంతరం.. విపక్ష ఎంపీలకు ఓ రేంజ్‌లో ఇచ్చిపడేసిన అమిత్ షా
కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించాలి
చర్చించవద్దని విపక్షాలు కోరడం సరికాదు
విపక్షాల కోరిక మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాం
జేపీసీ చర్చల తర్వాత సవరణలు ప్రతిపాదించింది
జేపీసీ రూపొందించిన బిల్లుపై మళ్లీ అభ్యంతరాలు ఏమిటి
-
2025-04-02T12:11:20+05:30
లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు ముందు బిగ్ ట్విస్ట్
లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజును కోరిన స్పీకర్ ఓంబిర్లా
కాంగ్రెస్ అభ్యంతరం
కాంగ్రెస్ తరపున బిల్లు ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కె ప్రేమ్ చంద్రన్
-
2025-04-02T11:31:01+05:30
బీసీల మహాధర్నాలో ఎంపీ కనిమొళి
బీసీల మహాధర్నాకు వచ్చిన వారికి స్వాగతం
వెనుకబడిన తరగతుల హక్కుల కొరకు పోరాటం కొనసాగుతుంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కు అసెంబ్లీలో ఆమోదం తెలిపారు
తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం
దేశం మొత్తం ఇలాంటి విధానంతోనే ముందుకు వెళ్లాలి
ఒక్క విద్యలోనే కాదు, అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి
బీసీ మహాధర్నకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది
-
2025-04-02T11:16:38+05:30
ఢిల్లీలో బీసీల పోరు గర్జన
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్
బీసీ సంఘాల ధర్నాకు హాజరైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
బీసీల పోరు గర్జన సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
-
2025-04-02T11:03:34+05:30
యూపీ డీజీపీ కీలక ఆదేశాలు
వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతి, భద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని డీజీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. సమస్యత్మాక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాలపై నిఘా ఉంచాలని డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. ఓల్డ్ లఖ్‌నవూ నుండి ఘంటా ఘర్ వరకు ప్రతిచోటా పోలీసు బలగాలను మోహరించారు.
-
2025-04-02T10:48:00+05:30
కాసేపట్లో లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
ప్రస్తుత వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తూ కొత్త బిల్లు
గత ఏడాది లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
విపక్షాల నిరసనల మధ్య జేపీసీకి వక్ఫ్ బిల్లు
వివిధ సవరణలతో కొత్త బిల్లు రెడీ
లోక్‌సభ ముందుకు రానున్న వక్ఫ్ బిల్లు