Waqf Bill: ఓట్లతో వ్యాపారం మానుకోవాలి.. విపక్షాలకు రవిశంకర్ ప్రసాద్ చురకలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:44 PM
బిల్లుపై చర్చలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: వెనుకబడిన ముస్లిం మహిళలు, ముస్లిం కమ్యూనిటీ స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Bill)ను తెచ్చామని, వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ విపక్షాల చేస్తున్న వాదనలో అర్ధం లేదని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) అన్నారు. కేవలం రాజకీయ అనివార్యతల కారణంగానే విపక్షాలు వక్ఫ్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. బిల్లుపై చర్చలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.
Kiren Rijiju: వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
రవిశంకర్ ప్రసంగంలో ముఖ్యంశాలు..
-రాజ్యాంగం రెడ్ కాపీని చేత్తో పట్టుకుని తేవడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ, ఇక్కడే పార్లమెంటులోని ''గ్రీన్ కాన్‌స్టిట్యూషన్" బుక్ నా వద్ద ఉంది.
-మహిళల సంక్షేమానికి చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెబుతోంది. అప్పుడు ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంది? ఈ బిల్లు వెనుకబడి ముస్లింల స్థితిని మెరుగుపరేచేందుకు ఉద్దేశించినది.
-రాజ్యాంగాన్ని చూపిస్తూ ఆర్గుమెంట్లు చేసే విపక్షాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలతోనే నేను సమాధానిమిస్తున్నారు.
-వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ.
-దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఎన్ని స్కూళ్లు, అనాథాశ్రమాలు, నైపుణ్య కేంద్రాలు, ఆసుపత్రులు నిర్మించారు?
-సంస్కరణలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు విపక్షాలు చెబుతున్నప్పటికీ రాజకీయ అనివార్యతల కారణంగానే సంస్కరణలను విభేదిస్తు్న్నాయి.
-370వ అధికరణను రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా హింసకు దారితీయవచ్చని విపక్షాలు వాదించాయి. కానీ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో అభివృద్ధి జరిగింది. ఉద్యోగావకాశాలు కలిగాయి.
-ముస్లిం కమ్యూనిటీ ఆదర్శాలు అబ్దుల్ కలాం ఆజాద్, ఏపీజే అబ్దుల్ కలామ్, అష్పఖ్ ఉల్లా ఖాన్, మొహమ్మది షమి తరహాలో ఉండాలి. 25-30 ఏళ్ల తర్వాత ఓట్ల వ్యాపారం మానేయాలని మనం ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన నుంచి వాళ్లు (విపక్షాలు) బయటకు రావడం లేదు.
-దేశం మారుతుంటే కాంగ్రెస్ చూస్తుండిపోయింది. వాళ్లు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎన్ని సీట్లకు (లోక్‌సభలో) పరిమితమయ్యారు?
ఇవి కూడా చదవండి..
Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?
Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
For National News And Telugu News