Home » Lok Sabha Elections
హమ్మయ్య.. సుదీర్ఘంగా సాగిన అంకానికి శుభం కార్డు పడనుంది. ఓటర్ల మనుసు గెలుచుకున్నదెవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.
ఎగ్జిట్ పోల్ నివేదికలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్సే దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 14 శాతంగా ఉన్న మైనారిటీ ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని చెబుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రపంచరికార్డు సృష్టించారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు! ‘‘భారతదేశ ఎన్నికలు నిజానికి ఒక అద్భుతం. వీటికి ప్రపంచంలో ఏదీ సాటిరాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో కన్నా ఈసారి ఎన్డీఏ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయని అందరూ..
కొన్ని సీట్లలో గెలుపోటములు లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తుంటాయని రాజకీయ పండితులు చెబుతుంటారు. దానికి తగినట్లే లోక్‌సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుచేయడం గమనార్హం.
అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో.. సిక్కిం క్రాంతి మోర్చా(ఎ్‌సకేఎం) రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగ్గా.. లోక్‌సభతోపాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
Lok Sabha Election Results: శనివారం సాయంత్రం విడుదలైన దాదాపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు(Exit Poll Results) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికే(NDA) మెజార్టీని ఇచ్చాయి. దాదాపు 350కి పైగా సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు.