Share News

Lok Sabha Polls 2024: ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. అసలు కారణం అదే..!

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:29 PM

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.

Lok Sabha Polls 2024: ఎన్నికల విధుల్లో 33మంది సిబ్బంది మృతి.. అసలు కారణం అదే..!
Poll Staff

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమిని తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 33మంది సిబ్బంది శనివారం ఎండల కారణంగా మృతిచెందారు. వీరిలో హోంగార్డులు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారంతో ముగిసింది. ఏడో విడత పోలింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. అత్యధిక వేడి కారణంగా 33 మంది ఎన్నికల సిబ్బంది మరణించారని ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు. బల్లియా లోక్‌సభ నియోజకవర్గంలోని సికందర్‌పూర్ ప్రాంతంలోని ఓ బూత్‌లో ఓటరు కూడా మృతి చెందాడని తెలిపారు. పోలింగ్ బూత్ వద్ద నిలబడి ఉన్న ఓటరు రామ్ బదన్ చౌహాన్ స్పృహతప్పి పడిపోయాడని.. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారన్నారు. వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ సిబ్బంది మృతి చెందడంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఈవో రిన్వా ఆదేశించారు.

Sikkim Assembly Elections: సిక్కింలో ఎస్‌కేఎం విజయభేరి, రెండీ సీట్లలోనూ నెగ్గిన సీఎం ప్రేమ్‌ సింగ్


మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం..

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధి నిర్వహణలో మృతిచెందిన ఎన్నికల సిబ్బంది కుటుంబ సభ్యులకు రూ .15 లక్షల పరిహారం అందజేస్తామని ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా తెలిపారు. రమాబాయి అంబేద్కర్ మైదానంలో ఈవీఎంలకు భద్రత కోసం ఉన్న పీఏసీ కానిస్టేబుల్ శనివారం లక్నోలో మృతి చెందారు.


ఏడో దశలో..

ఏడో దశలో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసీ, సేలంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. యూపీలో ఏడో దశ పోలింగ్ కోసం మొత్తం లక్షా 8వేల 349 మంది ఎన్నికల సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది.


Sikkim: ఎస్‌కేఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలైన మాజీ సీఎం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 02 , 2024 | 06:18 PM