Home » Madhya Pradesh
నాలుగో తరగతి విద్యార్థిపై క్లాస్‌రూమ్‌లోనే తోటి విద్యార్థులు పాశవికంగా దాడికి దిగారు. జామెట్రీ కాంపాస్‌తో 108 సార్లు పొడవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.
అత్తింటి వారు చేసిన నిర్వాకం కారణంగా ఓ భార్య కోర్డు మెట్లెక్కింది. నేను ఈ కుటుంబంలో ఉండనంటే ఉండను.. నాకు విడాకులు ఇప్పించండంటూ వేడుకుంది.
మధ్యప్రదేశ్‌లోని ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఒక పట్వారిని ట్రక్కుతో తొక్కించి ప్రాణాలు తీసింది. షహడోల్ జిల్లా సన్ రీవర్ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
బస్సులు, రైళ్లలో మహిళలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొందరు సీటు కోసం అందరితోనూ గొడవ పడితే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన రెండు రోజుల తర్వాత ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అధికార బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే, తమకు బోర్వెల్ నుండి నీళ్లు అందించడం లేదని గ్రామీణ మహిళలు ఆరోపిస్తున్నారు.
దంపతుల మధ్య తలెత్తే సమస్యలు.. కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తుంటాయి. భార్యలపై లేనిపోని సాకులు చూపుతూ చిత్రహింసలు పెట్టే భర్తలు చూస్తున్నాం.. అలాగే వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరకు భర్తలను కూడా చాలా మందిని చూస్తున్నాం. తాజాగా..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. బుధవారంనాడు మధ్యప్రదేశ్‌లోని దతియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, నటుడు సల్మాన్ ఖాన్ 'తేర్ నామ్' సినిమా తరహాలో 'మేరే నామ్' పేరుతో ప్రధానితో కూడా సినిమా తీయెచ్చని అన్నారు.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు దిగాయి. ఓటర్లను ఆకర్షించేందుకు లెక్కలేనన్ని హామీలిస్తూనే.. పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ..
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, 145 నుంచి 150 సీట్లను తాము గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల అనంతరం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రజల తీర్పును కాలరాసారని అన్నారు.
ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి తాను ఇక్కడే ఉంటే (ప్రధాని స్థానంలో) మన దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు.