Share News

Shivaraj Singh Chouhan: నాలుగుసార్ల సీఎం అడ్రెస్ మారింది..

ABN , Publish Date - Dec 27 , 2023 | 06:37 PM

నాలుగు సార్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఇప్పడు తన అడ్రెస్ మార్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. B8 74 బంగ్లాకు మకాం మార్చారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘనవిజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది.

Shivaraj Singh Chouhan: నాలుగుసార్ల సీఎం అడ్రెస్ మారింది..

భోపాల్: నాలుగు సార్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఇప్పడు తన అడ్రెస్ మార్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Sivaraj Singh chouhan) తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. B8 74 బంగ్లాకు మకాం మార్చారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘనవిజయం సాధించి మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బదులుగా మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో శివరాజ్ సింగ్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. బంగ్లా ఖాళీ చేసిన సందర్భంగా ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. శివరాజ్ సింగ్ ఖాళీ చేసిన బంగ్లాలో ఇకనుంచి మోహన్ యాదవ్ ఉంటారు.


భోపాల్‌లోని రింగ్ రోడ్‌పై ఉన్న బంగ్లాకు శివరాజ్ సింగ్ షిఫ్ట్ అవుతున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఈ బంగ్లాను కేటాయించింది. ఆయన ఉండేందుకు వీలుగా రింగ్ రోడ్ నెంబర్-1పై ఉన్న బంగ్లాకు కొద్దిరోజులుగా మార్పులు చేర్పులు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రెండు కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. బంగ్లా ఖాళీ చేస్తున్న సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ''ఇక్కడి నుంచే నేను (పాత బంగ్లా) నా ప్రజానీకం, రాష్ట్రం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. మోహన్ యాదవ్, ఆయన టీమ్‌ రాష్ట్ర అభివృద్ధి, ప్రగతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని ఆశిస్తూ వారికి అభినందనలు తెలుపుతున్నాను. టన్నుల కొద్దీ జ్ఞాపకాలు, సీఎంగా నా ప్రయాణం సజావుగా సాగడానికి సహకరించిన అందరి ప్రేమాభిమానులు తీసుకుని సంతోషంగా వెళ్తున్నాను'' అని అన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 06:42 PM