Home » Madhya Pradesh
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలకు ఇస్తున్న హామీలు శృతిమించుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఏకంగా ఒక ముందడుగేసి.. ఇద్దరు భార్యలకు స్కీం ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తీసుకువెళుతోన్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో నాలుగు ఈవీఎంలు పాడయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ జిహాద్’ను ప్రోత్సహిస్తూ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ముస్లింలను కోరుతోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ధార్, ఖర్గోన్‌లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ‘‘భారతదేశంఈ రోజు ఒక కీలక మలుపు ముంగిట నిలిచింది. దేశంలో ఓట్ జిహాద్ కొనసాగాలా లేక, రామ రాజ్యం కొనసాగాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి’’ అని ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
హిందూ - ముస్లిం వివాదంపై మోదీ రాజకీయ చరిత్ర ఆధారపడి ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ అంశం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీకి ఆయన సూచించారు.
ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయండి.. గిఫ్ట్‌లు పట్టండి అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసిన వారికి లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌తో పాటు ఇతర బహుమతులను ఆఫర్ చేయనున్నారు.
కాంగ్రెస్‌ను 'మునిగిపోతున్న నౌక' తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోల్చారు. నౌకకు అడుగున చిల్లు పడిందని, అది మునిగిపోకుండా ప్రపంచంలోని ఏ శక్తీ కాపాడలేదని జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, బద్వానీ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్‌ను సోమవారంనాడు ఉపసంహరించుకున్నారు. తమ పార్టీలో చేరమంటూ ఆయనను బీజేపీ ఆహ్వానించింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆస్తి ప్రభుత్వానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో వారసత్వపు పన్నును రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) ప్రభుత్వం రద్దు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.